హైదరాబాద్

ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూన్ 12: మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు దోహదపడతాయని ఏఐసీసీ సభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. కేవీఆర్ పంక్షన్ హాలులో కాంగ్రెస్ అధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో కేఏల్‌ఆర్, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, బీ-బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. కుల, మతాలకతీతంగా సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని సూచించారు. మైనార్టీలకు కాంగ్రెస్ ఆధ్వర్యలోనే లబ్ధి జరిగిందని అన్నారు. మండల శాఖ అధ్యక్షుడు కర్రె రాజేష్, మున్సిపల్ శాఖ అధ్యక్షుడు అబ్బసాని యాదగిరి యాదవ్, పట్టణ శాఖ అధ్యక్షుడు మెరుగు నరేష్, రాంరెడ్డి, రహమాన్, శ్రీను, అబ్ధుల్ ఖయ్యూమ్, రాజేష్, ఉప సర్పంచ్ యంపాల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మేడ్చల్: పండుగలు ఐకమత్యానికి ప్రతీకలని అందరూ కలిసిమెలిసి సంప్రదాయబద్ధంగా సోదరభావంతో జరుపుకోవాలని జిల్లా టీఆర్‌ఎస్ నేత మద్దుల శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మండలంలోని గుండ్లపోచంపల్లి మసీదులో రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసి ఉపవాస దీక్ష అనంతరం సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఉపవాస దీక్ష విరమించినవారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మహ్మద్ అక్బర్, షేఖ్ జాఫర్, ఇర్ఫాన్, ఇక్బాల్, అబ్బాసుద్ధీన్, చాంద్, సిరాజ్, సలీం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మహేశ్వరం: రంజాన్ మాసంలో ముస్లింలు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో అందరూ పాల్గొనడం ఐక్యత సమైక్యతకు నిదర్శనమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్నారు. మంగళవారం మహేశ్వరంలో మజీద్‌లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, అబుబాకర్, సలాం, అదిల్ అలీ, కాంగ్రెస్ మండల వైస్ ఎంపీపీ స్వప్ననవీన్, మండల పార్టీ అద్యక్షుడు శివమూర్తి, ఈశ్వర్, నవీన్ పాల్గొన్నారు.
వనస్థలిపురం: మన్సూరాబాద్ చౌరస్తాలోని సిద్దికి ఏ అక్బర్ మజీద్‌లో మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటుచేశారు. ముస్లింలు ప్రార్ధనలు చేశారు. ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి.. ముస్లిం మతపెద్దలకు స్వీట్లు తినిపించారు.
విఠల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ముస్లింలను అన్నివిధాల ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు చిక్కమెట్టు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు టంగుటూరి నాగరాజు, నాయిని నరేందర్ రెడ్డి, నాంపల్లి శంకరయ్య, జానిమియా, మజీద్ అధ్యక్షుడు ఫకీర్, యూసూప్, రియాజ్, ఖాజా, జబ్బర్, లతీఫ్, మునీస్, అహ్మద్, మొయిన్ పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: మండల పరిధిలోని దుద్యాల గ్రామంలో మంగళవారం ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తహశీల్దార్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున మండలానికి వచ్చిన దుస్తులను నిరుపేద ముస్లింలకు అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మంగమ్మ, సర్పంచ్ సోంనాథ్ పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీకాలనీ: ఇఫ్తార్ విందులతో హిందూ ముస్లింల మధ్య సోదరభావం పెంపొందుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక కార్పొరేటర్ జానకి రామారాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అషఫ్,్ర మున్నీర్, ఎం. ఎ.ఖదీర్, జాకీర్‌పాషా పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
హైదరాబాద్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు అని టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీటీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వింధు ఏర్పాటు చేశారు. విందులో నగరానికి చందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులతో పాటు పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.

రోయింగ్ చాంపియన్‌షిప్‌లో రాణించిన తెలంగాణ క్రీడాకారులు
హైదరాబాద్, జూన్ 12: తమిళానాడు చెన్నైలో జరిగిన జాతీయ రోయింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్చాచాటారు. తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం 34 మంది క్రీడాకారులు టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం రెండు బంగారు పతకాలు, మూడు రజత, ఒక కాంస్య పతకం గెలుచుకుంది. అండర్-15 విభాగం సింగిల్స్‌లో డీ.్భనుకుమార్ బంగారు పతకం సాధించింది. గ్రూప్ ఈవెంట్‌లో టీ.కార్తీక్, ఏ.రాకేష్, ఎన్.ఔమంత్. కే.సాయినాథ్‌లు బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో రోయింగ్ కోచ్‌లు వీవీ.రావు, మిథున్, డీ.అజయ్ రావులతో పాటు పతకాలు సాధించిన క్రీడాకారలు, కోచ్‌లు పాల్గొన్నారు.