హైదరాబాద్

28న ఎంసీఈఎంఈ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్(ఎంసీఈఎంఈ) స్నాతకోత్సవానికి గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు కాలేజీ నిర్వాహకులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 28న జరగనున్న ఈ స్నాతకోత్సవానికి లెఫ్టనెంట్ జనరల్, ఎంసీఈఎంఈ కమాండెంట్ పరంజిత్ సింగ్‌తో పాటు మిలటరీలో విశేషమైన సేవలందిస్తున్న మరో 400 మంది ఉన్నతాధికారులు ఈ స్నాతకోత్సవానికి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెక్నికల్ ఎంట్రీ స్కీంలో గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అధికారులకు ఇందులో గుర్తింపునివ్వనున్నట్లు తెలిపారు. తమ కాలేజీ విద్యార్థులకు, అధికారులకు గవర్నర్ నరసింహన్ ఎంతో స్పూర్తిగా నిలిచారని ఎంసీఈఎంఈ డిప్యూటీ కమాండెంట్, చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ మేజర్ జనరల్ టీఎస్‌ఏ నారాయణ పేర్కొన్నారు. దేశ ఆర్మీకి కావల్సిన ఆయుధాల అంశంపై ఇంజనీరింగ్ కోర్సులను జేఎన్‌యుతో కలిసి ఎంసీఈఎంఈ బోధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణలో తాము పాటిస్తున్న ఉన్నతమైన ప్రమాణాలకు గాను గోల్డెన్ పీకాక్ నేషనల్ అవార్డు దక్కినట్లు, క్వాలిటీకి సంబంధించి విద్యార్థులు చేసిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు దేశ ప్రధాని నుంచి ఐదుసార్లు ఐఎస్‌ఓ-9001 సర్ట్ఫికెట్‌ను స్వీకరించినట్లు తెలిపారు.
ఆకట్టుకున్న స్మీత మాధవ్ నృత్య ప్రదర్శన
కాచిగూడ, జూన్ 21: ప్రముఖ నృత్య కళాకారిణి స్మీత మాధవ్ కూచిపూడి నృత్య ప్రదర్శన వర్ణా ఆర్ట్స్ అకాడమీ ఆద్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నృత్య స్వర కన్వీనర్ జీవీ అన్నారావు పాల్గొన్నారు. 1997లో జాతీయ పురస్కారం అందుకున్న స్మీత మాధవ్ అని వక్తలు కీర్తించారు. బాల రామయణం చిత్రంలో జూనియర్ ఎన్టీ ఆర్‌తో కలసి నటించారని పేర్కొన్నారు. అనేక చిత్రలలో అవకాశం వచ్చినప్పటీకి సంగీతం, నృత్యంలో ఎం ఏ డీగ్రీ పూర్తి చేసి కళా రంగనికి సేవలందించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సభకు ముందు స్మీత మాధవ్ పుష్పాంజలి, గణేశవందనం, జతి స్వరం, శబ్దం, సంప్రదాయకమైన నృత్యలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎగ్జిబిషన్లతో ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం
సనత్‌నగర్, జూన్ 21: నూతన డిజైనర్లను పోత్సహించేందుకు ఎగ్జిబిషన్‌న్లు ఎంతగానో దోహదపడతాయని వర్ధమాననటి సనా షనూర్ అన్నారు. బుధవారం నగరంలోని తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ట్రెండ్జ్ ఎగ్జిబిషన్‌ను నిర్వాహకురాలు శాలుతో కలిసి ప్రారంభించారు. దేశంలోని అనేక నగరాల నుంచి మహిళా డిజైనర్ల, ప్రఖ్యాత డిజైనర్ల వస్త్రోత్పతులను ఓకే వేదికలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 23వ తేది వరుకు కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో 70కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన్నట్టు తెలిపారు.