హైదరాబాద్

నాలుగేళ్లు రూ.1080.49 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లు..వాటిని సకాలంలో పరిశుభ్రంగా ఉంచేందుకు వేలాది మంది కార్మికులతో పారిశుద్ద్య పనులను నిర్వహిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇపుడు మహిళా సాధికారతలోనూ అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన నాలుగేళ్లలో నగరంలోని మొత్తం 46వేల 983 స్వయం సహాయక బృందాల్లో అర్హత కల్గిన 37వేల 611 సంఘాలకు గడిచిన నాలుగేళ్లలో జీహెచ్‌ఎంసీ రూ. 1080.49 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ఇప్పించి మరో అరుదైన గుర్తింపును పొందింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1466 మురికివాడల్లో నివసిస్తున్న సుమారు 18లక్షల పై చిలుకు పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్న సంకల్పంతో జీహెచ్‌ఎంసీ కొద్ది సంవత్సరాల క్రితం దేశంలో ఏ మున్సిపాల్టీలోగానీ, కార్పొరేషన్‌లోని గానీ లేని విధంగా 46వేల 912 స్వయం సహాయక బృందాలను తయారు చేసింది. వీటిలో అర్హత కల్గిన మహిళా సంఘాలకు నాలుగేళ్లలో రూ. 1080.49 కోట్ల బ్యాంకు రుణాలను ఇప్పించి మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. పది మంది సభ్యులు గల ఒక్కో మహిళా సంఘానికి సగటున సుమారు రూ. 39వేల 664 ఆర్థిక సహాయాన్ని అందించింది. 2014 నుంచి బ్యాంకు లింకేజీ రుణాలు ఇప్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సంవత్సరం కేవలం 6850 బృందాలకు గాను రూ. 15684లక్షలు రుణంగా ఇప్పించగా, మరుసటి ఆర్థిక సంవత్సరమైన 2015-16లో 10వేల 36 సంఘాలకు రూ. 26499లక్షలను, 2016-18 ఆర్థిక సంవత్సరంలో 10వేల 90 సంఘాలకు గాను రూ. 29.220 లక్షలు, 2017-18లో పదివేల 10 సంఘాలకు రూ.34192లక్షలను అందజేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అలాగే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో 10వేల 690 మహిళా సంఘాలకు రూ. 320022లక్షల రుణాలను ఇప్పించాలన్న లక్ష్యంగా పెట్టుకోగా, 617 సంఘాలకు రూ. 2447 లక్షలను రుణాలుగా ఇపిప్చారు. మహిళలకు వడ్డీలేని రుణాల ను ఇప్పించటంతో పాటు సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రత్యేకంగా ప్రదర్శనలు నిర్వహించి, మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా జీహెచ్‌ఎంసీ కల్పిస్తోంది. దీంతో పాటు 15 నుంచి 25 మధ్య స్వయం సహాయక బృందాలను కలుపుతూ వెయ్యి 49 స్లమ్ లేవెల్ ఫెడరేషన్లను కూడా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన స్వయం సహాయక బృం దం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా పొదు చేస్తే ఆ గ్రూప్‌కు మొదటి రూ. 75వేలు రుణంగా అందిస్తున్నారు. రెండోసారి లక్షన్నర, మూడోసారి మూడులక్షలను రుణంగా అందిస్తూ, ఎలాంటి లోపాల్లేకుండా సక్రమంగా చెల్లించే గ్రూప్‌లకు ఒక్కో గ్రూ ప్‌కు గరిష్టంగా రూ. 10లక్షలను రుణాలుగా అందించిన నెంబర్ వన్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ ఎదిగింది. సీనియర్‌గా ఉన్న పలు గ్రూప్‌లను గుర్తించి ఒక్కో గ్రూప్‌కు రికార్డు స్థాయిలో రూ.14లక్షలను కూడా అందజేసిన సందర్భాలున్నాయి. ఆసక్తి కల్గిన ఔత్సాహిక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే బాటలో ఉన్నారు.
‘సాయం’ పొందుతూ..‘సేవ’ చేస్తూ..
దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్‌లో లేని విధం గా జీహెచ్‌ఎంసీ పరిధిలోని స్వయం సహాయక బృం దాలు ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు సమాజ సేవలో కూడా తమవంతు పాత్రను ఎంతో చురుకుగా పోషిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ కొంతకాలంగా నిరంతరం నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ’ హైదరాబాద్ కార్యక్రమంలో ఎంతో కీలకమైన విధులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంఘాలు తమకు సమీపంలో ఉన్న నాలాలు, చెరువుల్లో వ్యర్థ పదార్దాలు వేయకుండా నగరవాసులను చైతన్యపర్చటం, ఇంటింటికి వెళ్లి ఇం ట్లోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసే అంశంపై అవగాహన కల్పించటం, వేడుకల్లో దుబార ఖర్చులను నివారించటం, పిల్లలను క్రమంగా తప్పకుండా పాఠశాలకు పంపే అంశంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించటం వంటి ముఖ్యమైన సేవల అందిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కొత్తూరు, జూన్ 21: రోడ్డు ప్రమాదంలో ఇద్ధరు యువకులు మృతిచెందిన సంఘటన కొత్తూరు మండల శివారులోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్ కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కొత్తూరు వైపు ద్విచక్ర వాహనంపై మహమూద్ (30), సాధిక్ (28) అనే ఇద్దరు యువకులు వస్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతులు ఇరువురు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.
వాటర్ రీ సైక్లింగ్‌పై అవగాహన
* జలమండలి ఎండీ దాన కిషోర్ పిలుపు

హైదరాబాద్, జూన్ 21: వాటర్ రీ సైక్లింగ్ అంశంపై ప్రజల్లో మరింత అవగాహనను పెంపొందించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ పిలుపునిచ్చారు. ఇండియా వాటర్ సంస్థ ఆధ్వర్యంలో ‘వ్యర్థనీరు పునర్వినియోగానికి అనుకూలమైన మార్గాలు’ అనే అంశంపై నగరంలో గురువారం జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం తిరిగి వ్యర్థనీరుగా డ్రైనేజీలో కలుస్తుందన్నారు. గృహ సంబంధ వ్యర్థనీరు వృథాగా మూసీ నదిలో కలుస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 700 ఎంఎల్‌డీల వ్యర్థనీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేసి పునర్వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. శుద్ధ వ్యర్థనీరు వినియోగంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చేలా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు కృషి చేయాలని సూచింరు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మురుగునీరు పునర్వినియోగానికి కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పలు దేశాల్లో నీటి సరఫరా నిర్వాహణ కొరకు పలు రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన పలు కంపెనీలు ఈ సమస్యలకు టెక్నాలజీ పరంగా పరిష్కారం చూపిస్తున్నామని ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తక్కువ ఖర్చుతో జరిగే చూడాలని తాము కోరినట్లు ఎండి వెల్లడించారు.