హైదరాబాద్

పండుగ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 1: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని ప్రముఖ రచయిత్రి, జ్యోత్స్న కళాపీఠం అధ్యక్షురాలు ఆచార్య శరత్ జ్యోత్న్స రాణి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ రచయిత్రి కేతవరపు రాజ్యశ్రీచే ‘హిందు పండుగల వైశిష్టం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం వంశీ విజ్ఞాన పీఠం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జ్యోత్న్స మాట్లాడుతూ పండుగలు సామాజిక చైతన్యనికి పునాదులని పేర్కొన్నారు. హిందూ సంస్కృతిని కాపాడుకోవాడానికి పండుగలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా కేతవరపు రాజ్యశ్రీ హిందూ పండుగల వైశిష్టం గురించి వివరించారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావేంకట దీక్షితులు, వంశీ సంస్థ అధ్యక్షురాలు తెనే్నటి సుధాదేవి పాల్గొన్నారు.