హైదరాబాద్

రోడ్డు మధ్యలో గుంతలు.. ప్రమాదాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 9: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ పట్టణంలోని చిల్కానగర్ రహదారి మధ్యలో పడిన గుంతలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం సంబధిత శాఖ అధికారుల అలసత్వంతో వచ్చిపోయే వాహనాలతో అడుగడుగునా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నాచారం చౌరస్తా నుంచి చిల్కానగర్ మీదుగా ఉప్పల్‌లోని వరంగల్ జాతీయ రహదారి వరకు ప్రధాన రహదారి ఇదే. నిత్యం రాత్రింబవళ్లు ఈ రహదారి వచ్చిపోయే వాహనాలతో రద్ధీగా ఉంటుంది. ఇరుకైన రహదారిలో ఇటీవల జలమండలి వాటర్ పైప్‌లైన్ పనులు చేపట్టింది. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో వచ్చిన వర్షం నీటితో మురికినీటి గుంటలు తలపిస్తున్నాయి. వచ్చిపోయే వాహనాదారులు గుంతలు కన్పించక అందులో దొర్లి గుంతలో చిక్కుకుని కాళ్లు, చేతులు విరిగిన సంఘటనలు ఉన్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగడి బజార్ నుంచి కుమ్మరి బస్తీ, బీరప్పగడ్డ, శ్రీనగర్ కాలనీ, కావేరినగర్, గణేష్ నగర్, ఆదర్శనగర్, న్యూరాంనగర్, ఇందిరా గాంధీ విగ్రహం, చిల్కానగర్ చౌరస్తా వరకు గుంతలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నిత్యం ఇదే రహదారి మీదుగా అధికారులు, వీఐపీలు వచ్చి వెళ్తున్నా రహదారిలోని గుంతలు మరమ్మతులకు నోచుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్కూల్‌కు వెళ్తున్న తల్లీబిడ్డలు కింద పడిన ఘటనలో చిన్నారి మృతి చెందిన సంఘటన తెలిసిందే.
వెంకన్నను దర్శించుకున్న వకుళాభరణం
కాచిగూడ, జూలై 9: తిరుమల వేంకటస్వామి దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు సోమవారం తన కుంటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆదివారం తిరుమల కొండకు చేరుకున్న వకుళాభరణం కుంటుంబ సభ్యులను బీసీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. వకుళాభరణం కృష్ణ మోహన రావును పూలమాల, శాలువతో ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం స్వామి దర్శనం చేసుకుని తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని వేడుకున్నట్లు ఆంధ్రభూమితో వివరించారు.