హైదరాబాద్

మొక్కల పంపిణీ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, పచ్చదనాన్ని పెంపొందించటంతో పాటు మరింత ఆహ్లాదరకమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు మరో దఫా హరితహారం కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ సర్వం సిద్ధం చేసుకుంది. మొత్తం 40లక్షల మొక్కలను నాటాలన్న లక్ష్యంతో ఈ సారి హరితహారం నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇప్పటికే నగరవాసులకు రెండు లక్షల మొక్కలను పంపిణీ చేసిన జీహెచ్‌ఎంసీ, ఈ మొక్కల పంపిణీ సర్కిల్ స్థాయిలో మరింత సరళీకృతంగా జరగాలని భావిస్తోంది. ఇందుకు గాను సర్కిళ్ల వారీగా నున్న నర్సరీలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జి అధికారులను నియమించి, ప్రజలకు కావాల్సిన మొక్కలను అన్ని పార్కులు, నర్సరీల్లో అందుబాటులో ఉంచినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 30 సర్కిళ్లలో సికిందరాబాద్, బేగంపేట, ముషీరాబాద్, సంతోష్‌నగర్, సాలార్‌జంగ్, రాజేంద్రనగర్ సర్కిళ్లకు ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉండగా, మిగిలిన సర్కిళ్లలోని నర్సరీలకు ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు కమిషనర్ వివరించారు.
సర్కిళ్ల వారీగా నర్సరీలు, అధికారులు
మలక్‌పేట సర్కిల్‌లోని సెట్విన్ మలక్‌పేట నర్సరీ, కాప్రా సర్కిల్‌కు సర్వోత్తంరెడ్డి(8143477497), కాప్రా జీవన్‌రెడి డ(9493742223), ఉప్పల్ నర్సింగ్‌రావు (9440785747), హయత్‌నగర్ రాజేశ్(868 607 4816), ఎల్‌బీనగర్ గణేష్ (9700 682265), సరూర్‌నగర్ శ్రీకాంత్ (9963679664), మూసాపేట ముళ్ల త్వ నర్సరీ ఇన్‌చార్జిగా సమత (9182 230392), జీడిమెట్లలోని గ్రీన్‌పా ర్కు నర్సరీ ఇన్‌చార్జిగా దివ్య (81068ఒఒ34285), బొల్లారంలోని రైల్వే ఎంప్లాయిస్ కాలనీ నర్సరీ ఇన్‌చార్జిగా భాస్కర్ (9959040756), ఖైరతాబాద్‌లోని ఇందిరాపార్కు నర్సరీకి శ్రీనివాస్ రెడ్డి (970416 3635), జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని విజయ నర్సరీకి కృష్ణారెడ్డి (9948363154), మెహిదీపట్నం సర్కిల్‌లోని చాచానెహ్రూపార్కులో ని నర్సరీకి ప్రణయ (98661 5423 8), ఇదే నర్సరీకి సంబంధించి మరో సర్కిల్‌కు జానకి (62819 39045), సర్కిల్ 19లోని నల్లగండ్ల నర్సీరిలోని ఒక భాగానికి జే.హేమ (9100 025158), ఇదే నర్సరీకి పీ.గోపాల్ (9059555824), సర్కిల్ 21లోని నాగార్జున నర్సరీకి సుచిత్ర (95427 35860), సర్కిల్ 22లోని అన్నయ్య నర్సరీకి పీ.శ్రావ్య(960 3417656) ను నియమించినట్లు అధికారులు తెలిపారు.