హైదరాబాద్

పాతబస్తీలో పార్కింగ్ సమస్యకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: పాతబస్తీకి వాహనం తీసుకుని వెళ్తే.. మనం వెళ్లిన పని సంగతేమో గానీ వాహనం ఎక్కడ పార్కింగ్ చేయాలన్నది పెద్ద తలనొప్పిగా మారింది. ఎటు చూసినా వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసి ఉంచటం, మరికొన్ని చోట్ల ఫుట్‌పాత్‌పైనే వ్యాపార సంస్థలు, మరికొన్ని చోట్ల రోడ్డు మధ్య వరకు అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేసి ఉంచటం దర్శనమిస్తోంది. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ కొంతకాలంగా చేస్తున్న కృషి త్వరలోనే ఫలించనుంది. ఇప్పటికే కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకుని జీహెచ్‌ఎంసీ చేపట్టిన చార్మినార్ పెడేస్టేరియన్ ప్రాజెక్టు పనులు కూడా తుది దశకు వచ్చాయి. పాతబస్తీలో నిత్యం రద్దీగా ఉండే శాలిబండ, లాల్‌దర్వాజ, ఖిల్వత్, మోతీగల్లీ, మదీనా మెయిన్‌రోడ్డుతో పాటు ప్రతిరోజు వేలాది మంది రాకపోకలు సాగించే హైకోర్టులో కూడా పార్కింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఖిల్వత్‌లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సును నిర్మించాలనే ప్రతిపాదన గత పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఇందుకు రకరకాలుగా రాజకీయంగా అడ్డంకులు ఎదురుకావటంతో అప్పట్లో ఈ ప్రతిపాదనను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం పాతబస్తీలోని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తు భవనాలను నిర్మించి, పార్కింగ్‌కు కేటాయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్టు పనులు ముగిసి, అందుబాటులోకి వచ్చిన తర్వాత వాహనాల పార్కింగ్ కోసం ఖిల్వత్ వద్దే మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సును నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
చార్మినార్ చుట్టూ నిర్ణీత దూరం వరకు వాహనాలను అనుమతించే అవకాశం లేకపోవటంతో ఖిల్వత్‌లో పార్కింగ్ కాంప్లెక్సు అందుబాటులోకి తెస్తే పెడేస్టేరియన్ ప్రాజెక్టు సక్సెస్ అవుతోందని అధికారులు భావిస్తున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. దీంతో పాటు శాలిబండ బస్టాండ్‌లో, కులీకుతుబ్‌షాహీ అర్బన్ డెవలప్‌మెంట్ ఆఫీసు ఆవరణతో పాటు హైకోర్టులో ప్రస్తుతమున్న పార్కింగ్‌ను మల్టీలేవెల్ పార్కింగ్ కాంప్లెక్సుగా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో హైకోర్టు మినహా మిగిలిన చోట్ల కాంప్లెక్సుల నిర్మాణానికి సానుకూలమైన పరిస్థితులుండగా, హైకోర్టులో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సు నిర్మాణం విషయమై త్వరలోనే సంబంధిత అధికారులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.