హైదరాబాద్

30లక్షల ట్రీగార్డ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించటంతో పాటు పర్యావరణ, మానవాళి మనుగడ కోసం జీహెచ్‌ఎంసీ ఉద్యమ స్పూర్తితో నాటే మొక్కల పరిరక్షణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. హరితహారంలో నాటనున్న సుమారు 40లక్షల మొక్కలకు ప్రత్యేకంగా ట్రీగార్డులను ఉచితంగా సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. నగరంలోని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ఈ ట్రీగార్డులను ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏకంగా 30 లక్షల ట్రీగార్డులను వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి సమకూర్చుకోవటంలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న 40లక్షల మొక్కల్ల జీహెచ్‌ఎంసీ ద్వారా ఐదు లక్షల మొక్కలను నగరంలోని వివిధ ప్రధాన రహదారులకిరువైపులా నాటడంతో పాటు మిగిలిన మొక్కలను నగరవాసులకు ఉచితంగా పంపిణీ చేసి, వారి ఇంటి ఆవరణ, ఆఫీసుల్లోని ఖాళీ ప్రాంతాల్లో నాటేలా చర్యలు చేపట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ట్రీగార్డులను అందజేయాలని జీహెచ్‌ఎంసీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. అజామాబాద్‌లోని వజీద్ సుల్తాన్ టుబాకో(వీఎస్‌టీ) యాజమాన్యం ట్రీగార్డుల కోసం రూ.4లక్షలను అందించనున్నట్లు ప్రకటించిందని అధికారులు తెలిపారు. రూ.4లక్షలను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గురువారం జీహెచ్‌ఎంసీకి అందించనున్నట్లు వెల్లడించారు. ఈస్ట్‌జోన్‌లోని వివిధ కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు రూ. 11లక్షల విలువైన ట్రీగార్డును జీహెచ్‌ఎంసీకి అందించేందుకు ముందుకొచ్చాయి. వీటితో పాటు కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో హెటారో డ్రగ్స్ యాజమాన్యం రూ.లక్ష, కాప్రా సర్కిల్‌లో తెలంగాణ ఇండస్ట్రీయల్ ఏరియాలోని పారిశ్రామికవేత్తలు రూ.3.70లక్షలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్ల యజమానులు రూ.2.10 లక్షలను ట్రీగార్డుల కొనుగోలు కోసం జీహెచ్‌ఎంసీకి అందించనున్నారు. నగరానికి చెందిన కొందరు తమ పుట్టిన, పెళ్లి రోజు వంటి సందర్భాలను పురస్కరించుకుని కూడా ట్రీగార్డుల కోసం విరాళాలిచ్చేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఇప్పటికే పలు బ్యాంక్‌లు ట్రీగార్డులు అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ట్రీగార్డులు లభ్యమయ్యే ప్రాంతాలు, వాటి నమూనాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.