హైదరాబాద్

1న ఓటరు జాబితా ముసాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: వచ్చే నెల 1వ తేదీన నగర ఓటరు జాబితా ముసాయిదాను జారీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి డా.బీ. జనార్దన్ రెడ్డి వెల్లడించారు. అంతలోపు ప్రజలు ఓటరు జాబితాపై తమకున్న అభ్యంతరాలను సంబంధిత ఓటరు రిజిస్ట్రేషన్ అధికారులకు సమర్పించుకోవచ్చునని సూచించారు. ఓటరు జజాబితా సవరణ ప్రక్రియపై కమిషనర్ గురువారం ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత మే మాసం ఒకటవ తేదీన ప్రారంభించిన ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే పూర్తయిందని, ఈ సర్వే సందర్భంగా లక్షా 42వేల మంది ఓటర్ల పేర్లు పలు సార్లు నమోదైనట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ సర్వే సందర్భంగా 11వేల 974 మంది ఓటర్లు పర్మినెంటుగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చిరునామాను మార్చుకున్నారని, వీరిలో నిబంధనలు అనుసరించి విచారణ నిర్వహించిన తర్వాత 2వేల 732 ఓటర్ల వివరాలను తొలగించినట్లు తెలిపారు. 2014 నుంచి 2018 జూలై మాసం వరకు నగరంలో లక్షా 22వేల మంది ఓటర్లు మృతి చెందినట్లు ప్రస్తుతమున్న రికార్డుల ద్వారా వెల్లడైందని తెలిపారు. ఈ జాబితాను సంబంధిత ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు పంపి, వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో గుర్తించిన 6వేల 477 మంది వికలాంగులకు ఓటింగ్ సందర్భంగా తగు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై చైతన్యం కల్పించేందుకు గాను ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు నిర్ణయించినట్లు, ఇందులో ఇప్పటి వరకు 528 లిటరసీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల రేష్నలైజేషన్ ప్రతిపాదనలను అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌ఓలు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను గుర్తింపు, రిజిష్టర్ అయిన రాజకీయపార్టీలకు అందించి, వారి అభిప్రాయాలు వెల్లడించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా ఇంటింటి సర్వే జరిగిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.