హైదరాబాద్

‘కంటివెలుగు’కు మహా కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, అద్దాల పంపిణీతో పాటు శస్తచ్రికిత్సలు నిర్వహించేందుకు ప్రభుత్వం ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని ప్రతిష్టంగా నిర్వహించనుంది. హైదరాబాద్ నగరంలో కోటి 20 లక్షల మందికి ఈ పరీక్షలు నిర్వహించే శిబిరాల నిర్వాహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ, జిల్లా కలెక్టర్ సంయుక్త్ధ్వార్యంలో సమష్టిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని సుమారు 1600 పైచిలుకు ఉన్న కమ్యూనిటీ హాళ్లలో ఈ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇప్పటికే మండలాల వారీగా కలెక్టర్ ఇన్‌చార్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్‌ఎంసీ కూడా శిబిరాల నిర్వాహణకు అవసరమైన కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, ఇతర విద్యాలయాలు వంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర భవనాలను గుర్తించాలని సర్కిల్ స్థాయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లకు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కంటివెలుగు విజయవంతమయ్యేలా నిర్వహించేందుకు కలెక్టర్ యోగితా రాణా 16 మండలాలకు ఇన్‌చార్జి అధికారులను నియమించారు.