హైదరాబాద్

జనమే జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభకు వేలాది మంది యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టేడియం పూర్తి జనంతో నిండిపోవడంతో వేలాది మంది రోడ్లపై కిలోమీటర్ల కొద్ది ఉండిపోయారు. ఎల్బీనగర్, ఉప్పల్, సాగర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడువున జనాలతో నిండిపోయింది. సరూర్‌నగర్ స్టేడియం పూర్తిగా కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. కొత్తపేట్ నుంచి ఎల్బీనగర్ వరకు మేట్రో పిల్లర్లకు ఇరువైపుల పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయించారు. స్టేడియంలో కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి బ్యానర్లతో నిండిపోయింది. బహిరంగ సభకు హాజరైన ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు, కార్యకర్తలకు, నాయకులకు మంచి నీటి ప్యాకెట్లు అందజేశారు. బహిరంగ సభ ఏర్పాట్లను దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచే ప్రజలు స్టేడియంలోకి రావడం మొదలైంది. కాంగ్రెస్ జెండాలను ఊపుతూ.. ర్యాలీలుగా బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయంత్రం నాలుగు గంటల వరకు సరూర్‌నగర్ స్టేడియం పూర్తిగా జనంతో కిటకిటలాడింది. భారీ బలగాలు, అశ్వదళం, పారామిలటరీ బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎల్బీనగర్ నుంచి కొత్తపేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపుల దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు వాహనాలను పార్కింగ్ చేశారు. స్టేడియంలోకి వేళ్లేందుకు రెండు గేట్లు ఉండగా ప్రధాన గేటులో నుంచి ప్రజలను పంపారు.
తెలుగులో మాట్లాడిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ కాన్వాయి నేరుగా రెండో గేటు నుంచి సభ ప్రాంగణం సమీపంలోకి వచ్చింది. కాన్వాయి నుంచి దిగిన రాహుల్ గాంధీకి 150 మంది బోకేలను అందజేశారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ అభివాదం చేస్తూ వేదికపైకి వచ్చి అశీనులు అయ్యారు. రాహుల్ గాంధీతో పాటు సభ ప్రాంగణంపై 40 నుంచి 45 మంది మాత్రమే వచ్చారు. రాహుల్ గాంధీ వేదిక మీదకు వస్తూ ప్రజలకు అభివాదం చేయడంతో ఒక్కసారిగా ప్రజలు లేచి రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ అధ్యక్షత వహించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియమకాలు అని తెలుగులో అనడంతో జనం లేచి కేరింతలు కొట్టారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి దాసోజు శ్రవణ్ అనువదించారుతెలంగాణలో దాదాపు రెండు లక్షలకుపై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎందుకు భర్తీ చేయడం లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్లు వేస్తుంటే అడ్డుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఉంటాయని ఆశించిన ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, వీహెచ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కేసీఆర్ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోనియా కాళ్లు మొక్కినది మరిచావా అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం ముగియగానే భట్టి విక్రమార్క, సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా స్టేడియంలో ఉన్న యువకులు పెద్ద ఎత్తున నినదాలు చేస్తూ రేవంత్ మాట్లాడాలని నినాదాలు చేశారు. వారి ప్రసంగం ముగియగానే రేవంత్ రెడ్డి మైక్ అందుకున్నారు. సభా వేదికపై కుంతియా, జానారెడ్డి, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, షబీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ అశీనులయ్యారు.