హైదరాబాద్

జల్లుపడితే..గుండె ఝల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ఆకాశం మేఘావృతమై..జల్లు పడే అవకాశముందని తెలియటంతో వాహనదారుల గుండె ఝల్లుమంటోంది. గురువారం భాగ్యనగరాన్ని మరో సారి వర్షం జల్లులు తడిసి ముద్ద చేశాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లబడి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో కురిసిన జల్లుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అసలై ఇరుకైన రోడ్లు, పైగా వాటికిరువైపులా అక్రమంగా వాహానాలను పార్కింగ్ చేయటం, రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవటంతో నగరంలో చినుకుపడిందంటే చాలు ప్రయాణం ప్రత్యక్ష నరకంగా మారింది.
సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా చిరుజల్లులు కురవటంతో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్, పంజాగుట్ట, మాసాబ్‌ట్యాంక్, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, బేగంపేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాలతో పాటు మాసాబ్‌ట్యాంక్, తెలుగుతల్లి, ఖైరతాబాద్, బేగంపేట ఫ్లైఓవర్లపై వాహానాలు క్యూ కట్టాయి. పంజాగుట్ట, రాణిగంజ్, ప్రకాశ్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వవటంతో వాహన రాకపోకలు మెల్లిగా సాగినందుకే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రజలకు వానాకాలం కష్టాలు ఎదురుకాకుండా రౌండ్ ది క్లాక్ నీటిని తోడేసేందుకు, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ఇన్‌స్టెంట్ రిపేర్స్ టీంలను అందుబాటులో ఉంచామని, అధికారులు చెబుతున్నా, ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఈ టీంలు ఎక్కడా కూడా పనిచేస్తున్నట్లు కన్పించలేదు. పైగా వాటర్ స్టాగినేట్ పాయింట్లలో నీటిని తోడేసేందుకు ఎక్కువ సామర్థ్యం కల్గిన మోటార్లను కొనుగోలు చేశామని అధికారులు ఇటీవలే చెప్పినా, ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో మోటార్ల ద్వారా నీటిని తోడేసిన దాఖలాల్లేవు. రోడ్లు గుంతలమయం కావటం, అక్రమ పార్కింగ్‌లకు కొన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు పనులు, వాటర్ బోర్డు తవ్వకాలు తోడుకావటంతో వాహనదారులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి.
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చల్లటి గాలులతో ఓ మోస్తారు వర్షం, ముసురు, ఓసారి భారీవర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.
నియోజకవర్గంలోని బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, మల్లంపేట్, బౌరంపేట్, దుందిగల్, గాగిల్లాపూర్, దొమ్మరపోచంపల్లి, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలో మరియు కుత్బుల్లాపూర్, గాజుల రామారం జంట సర్కిళ్లలోని గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, చింతల్, సూరారం, సుభాష్‌నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ డివిజన్‌లలో బుధవారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ చల్లటి ఈదురు గాలులు వీసాయి. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రోడ్లు నిండిపోయాయి.