హైదరాబాద్

రావయ్య.. గణపయ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక చవితిని పురస్కరించుకుని ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సిద్ధం చేసిన మండపాలకు గణనాధుడి విగ్రహాలు తరలుతున్నాయి. గురువారం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావటంతో దూల్‌పేట పరిసర ప్రాంతాల నుంచి భారీగా గణపయ్య విగ్రహాలు తరలుతుండటంతో, తరలింపులో ఎలాంటి అపశృతులు, అవాంఛనీ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ దారుల్లో మళ్లిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా రాత్రి పూట తరలుతున్న గణనాధుడి విగ్రహాల తరలింపు గురువారం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశమున్నందున, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి, చేవేళ్ల, మోయినాబాద్, హయత్‌నగర్, ఘట్‌కేసర్, ఉప్పల్, శామీర్‌పేట తదితర ప్రాంతాలకు కూడా దూల్‌పేట విగ్రహాలు తరలుతున్నాయి. ఈసారి ముందస్తు ఎన్నికల ముందు వినాయక చవితి ఉత్సవాలు రావటంతో నవరాత్రి మరింత ఘనంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో మండపాలను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. ప్రత్యేకంగా బేగంబజార్, పాతబస్తీలోని లాల్‌దర్వాజ, గౌలీపుర, మొఘల్‌పుర, మలక్‌పేట, సైదాబాద్, మాదన్నపేట, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో మండపాల ముస్తాబు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఈ వినాయకుడిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కుతుందో లేదో అని నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఖైరతాబాద్‌కు తరలివచ్చారు. గురువారం నుంచి ఖైరతాబాద్‌తో పాటు భారీ విగ్రహా లు కొలువుదీరిన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మండపాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయటంతో పాటు ప్రత్యేక పికెటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
‘చవితి’ సెంటిమెంట్
ముందస్తు ఎన్నికల్లో ఇప్పటికే టికెట్లు ఖరారైన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు గురువారం నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి ఉత్సవాల సెంటిమెంట్‌తో ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావాహులు గురువారం నుంచి ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు. నగరంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో సైతం మజ్లిస్ యేతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గురువారం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బీజేపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు గురువారం తమ దరఖాస్తును విఘ్నేశ్వరుడి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధిష్ఠానానికి సమర్పించాలని భావిస్తున్నారు.