హైదరాబాద్

ఆధునిక మార్కెట్లలో షాపులను అర్హులకే కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: మహానగరంలో జనాభాకు తగిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధునిక మార్గెట్లలో షాపులను అర్హులైన వారికే కేటాయించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆధునిక మార్కెట్ల నిర్మాణ పనులు, ఇతర ప్రాజెక్టుల పురోగతి నిమిత్తం ఆయన మంగళవారం వివధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆధునిక మార్గెట్లలో షాపుల కేటాయింపునకు సంబంధించి అధికారులు పారదర్శకతతో వ్యవహారించాలని సూచించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులు, శ్మశానవాటికల్లో వౌలిక వసతుల ఏర్పాట్లు, మోడల్ మార్కెట్లు, చెత్త డంపింగ్ యార్డులు వంటి అంశాలపై పనుల పురోగతిని అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో వెలుగుచూసిన అవకతవకలు, లోపాలను సరిదిద్దటంతో కార్పొరేషన్ నిధులు దారి మళ్లకుండా నియంత్రించగలిగామని వివరించారు. అయితే ఈ విభాగంలో సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకత సాధించేందుకు గాను బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని కొందర అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం బయోమెట్రిక్ విధానామే గాక, కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను కూడా జారీ చేసేందుకు వీలుగా సర్కిళ్ల వారీగా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల తమకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ఈ విభాగం సక్రమంగా పనిచేయాలంటే సర్కిళ్ల వారీగా ఉన్న అసిస్టెంటు మెడికల్ హెల్త్ ఆఫీసర్లు కీలకమైన విధుల నిర్వర్తించాలని కమిషనర్ సూచించారు. కార్మికుల హాజరు, పని విషయంలో పూర్తి బాధ్యతలు సంబంధిత ఏఎంవోహెచ్‌లదేనని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విభాగంలో అవకతవకలకు పాల్పడిన వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవటంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.