హైదరాబాద్

అధికార దుర్వినియోగానికి పాల్పడుతోన్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: అసెంబ్లీ రద్దయిన తర్వాత అపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారిక ప్రగతి భవనంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించటాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారికంగా నిర్మించిన ప్రగతి భవనం ఏమైనా పార్టీ ఆఫీసా? అని నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. మంగళవారం నగర టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రగతి భవన్‌లో అధికారులతో, పార్టీ ముఖ్యనేతలతో తరుచూ కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పీఏ, పీఎస్‌లతో ప్రకటనలు చేయిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని ముఖ్యమంత్రి, అపధర్మ మంత్రులు.. సచివాలయం, ప్రగతి భవన్‌లో పాత తేదీలతో వారికి కావల్సిన ఫైళ్లను పూర్తి చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమాలు, అవినీతితో సంపాదించిన డబ్బును ఎరగా వేసి ఎన్నికల్లో గెలిచి, రాజకీయంగా లబ్ధిపొందాలని టీఆర్‌ఎస్ భావిస్తోందని, ఇటీవలే అపధర్మ హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎంఎన్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు తమ వద్ద క్లిప్పింగ్‌లు కూడా ఉన్నాయని, తర్వాత పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే హోంమంత్రి పార్టీ కార్యాలయానికి వెళ్లి రూ.10 కోట్లు అనలేదని, రూ.10లక్షలు అన్నానని మాట మార్చారని ఎంఎన్ వివరించారు. పలు నియోజకవర్గాలకు ప్రభుత్వ వాహనాల్లో, కొందరు అధికారులు కొందరు అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నారని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో కుట్టుమిషన్లు, కుక్కర్లు, గ్యాస్‌పొయ్యిలు, మిక్సీలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం, గవర్నర్ నిఘా పెట్టి ప్రస్తుతం సచివాలయం, ప్రగతి భవన్‌లో క్లియర్ అవుతున్న ఫైళ్లలోని సంతకాలను తనిఖీ చేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం రమేశ్, నెల్లల కిషోర్, బిల్డర్ ప్రవీణ్, కప్ప కృష్ణ గౌడ్, శ్యామ్‌సుందర్, పీ.సత్యనారాయణ పాల్గొన్నారు.

మాజీ ఎంపీకి నివాళి
కుషాయిగూడ, అక్టోబర్ 16: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజయ్య తోడ్పడ్డారని మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు అన్నారు. పార్లమెంట్ మాజీ సభ్యుడు మల్యాల రాజయ్య ఆకస్మిక మృతిచెందడంతో సికింద్రాబాద్ నివాసంలో మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కంటోనె్మంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న, రఘువరన్, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శోభారెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

గిరిజనుల పట్ల చిత్తశుద్ధి తెలిసింది
ఖైరతాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన రాములు నాయక్ సస్పెన్షన్‌తో టీఆర్‌ఎస్ చిత్తశుద్ధి బహిర్గతం అయిందని లంబాడీల ఐక్య వేదిక పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు రాజ్‌కుమార్ జాదవ్ మాట్లాడారు. కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా రాములు నాయక్‌ను పార్టీ నుంచి బహిష్కరించారని దుయ్యబట్టారు. ఆనాడు రవీంద్రనాయక్‌ను కొట్టించిన కేసీఆర్ నేడు రాములు నాయక్‌పై వేటువేసి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. రాములు నాయక్‌ను బహిష్కరించడాన్ని యావత్ లంబాడీలు ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణలో లంబాడీలను బలితీసుకుంటున్నారని, అమాయక గిరిజనుల మీద పీడీ యాక్ట్‌లతో వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. సమావేశంలో ప్రొఫెసర్ చందు నాయక్, గణేష్ నాయక్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌దే గెలుపు
వనస్థలిపురం, అక్టోబర్ 16: ఎల్బీనగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగోలు డివిజన్ పరిధిలోని పలుకాలనీలలో స్థానిక కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత గౌడ్‌తో కలసి ఇంటింటికీ తిరుగుతూ, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. పెద్దులు, అరుణ, సోమయ్య గౌడ్, ప్రమీల పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయంలోనే రాష్ట్భ్రావృద్ధి
షాబాద్, అక్టోబర్ 16: కాంగ్రెస్ హయంలోనే రాష్ట్భ్రావృద్ధి జరిగిందని పార్టీ మండల అధ్యక్షడు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని సోలిపేట్, మద్దూర్, పెద్దవీడు, నాంన్‌దార్‌ఖాన్ పేట్, దామర్లపల్లి, లింగారెడ్డిగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు వెంకటస్వామి, రత్నంతో కలిసి పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కేవలం కాంగ్రెసేనని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తెలంగాణ పేరు పెట్టుకొని గెలిచి ప్రజలను మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో రాంరెడ్డి, శేఖర్, నర్సింలు, అష్మాత్ పాష, అంజయ్య, కుమార్ పాల్గొన్నారు.