హైదరాబాద్

పానీ..పానీ.. పోతే పోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంఫట్నం, అక్టోబర్ 19: ఓవైపు గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యంతో కృష్ణాతాగునీరు వృథాగా పారుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో పాటు ఐదారు రోజులకు ఒకమారు నీటిని విడుదల చేస్తుండడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో కృష్ణాతాగునీటి పైపులైన్ లీకేజీల వల్ల నిత్యం వేలాది లీటర్ల తాగునీరు రోడ్లపై వృథాగా పారుతోంది. వివరాల్లోకి వెళితే యాచారం మండలం గున్‌గల్ గ్రామంలో కృష్ణాపైపులైన్ గేట్ వాల్వ్ లీకేజీతో వేలాధి లీటర్ల తాగునీరు వృథాగా పారింది. పైపులైన్ లీకేజీ ప్రాంతంలో కుంటగా ఏర్పడి తాగునీరు భారీగా వృథా అయ్యింది. అధికారులకు ఈ విషయమై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా వారిలో స్పందన కరవైంది. దసరా సెలవులుండడంతో అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. నిత్యం తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు కనీసం నీటి వృథాను సైతం అరికట్టలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో నీటిపైపులైన్ లీకేజీతో వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పారుతోందని కుంటగా ఏర్పడిందని, పైపులైన్ లీకేజీ పెరిగితే పెనుప్రమాదం పొంచి ఉందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు చొరవ చూపి పైపులైన్ లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వరుస సెలవులతో బోసిబోయిన నగరం
హైదరాబాద్, అక్టోబర్ 19: భాగ్యనగర్‌లో దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించిన మండపాల సంఖ్య ఈ సారి గణనీయంగా పెరిగింది. నిత్యం వాహానాల రద్దీ..వివిధ రకాల పనులపై జనం రాకపోకలతో బిజీ బిజీగా ఉండే నగరం ఇపుడు బోసిబోయింది. దసరా పండుగ జరుపుకునేందుకు ఎక్కువ మంది నగరవాసులు తమ స్వస్థలాలకు తరలివెళ్లటంతో రోడ్లపై వాహన రాకపోకలు పలుచబడ్డాయి. శుక్రవారం వర్కింగ్ డే అయినప్పటికీ, ఉదయం, సాయంత్రం ఆఫీసు వేళల్లో నగర వీధులు, మెయిన్‌రోడ్లన్నీ ఖాళీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా దసరా పండుగకు ఈ సారి ప్రభుత్వం రెండురోజులు సెలవు ఇవ్వటం, ఆ రోజులు వారం చివరల్లో రావటం ప్రభుత్వ ఉద్యోగులకు కలిసొచ్చింది. అంతేగాక, ఈ సారి నవరాత్రి ఉత్సవాల్లో ఏ రోజు దశమి అన్నది కొంత అయోమయంగా రావటంతో కొందరు గురువారమే దశమి జరుపుకోగా, మరికొందరు శుక్రవారం జరుపుకున్నారు. గురువారం జరుపుకున్న వారిలో కొందరు ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి నగరానికి తిరుగు ప్రయాణం కాగా, ఇక శుక్రవారం పదవ రోజు జరుపుకున్న వారిలో ఎక్కువ మంది ఆదివారం నగరానికి తిరిగి వచ్చేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు. దసరా పండుగను తమ స్వస్థలాల్లో జరుపుకునేందుకు తరలి వెళ్లటంతో పలు ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు మూతపడటంతో శుక్రవారం కూడా సెలవురోజును తలపించాయి. రద్దీగా ఉండే ఆ ప్రాంతాలు ఇపుడు నిర్మానుష్యంగా మారాయి.