హైదరాబాద్

ఆనందోత్సాహాలతో దీపావళి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దీపావళి పర్వదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నియోజకవర్గంలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లలోని ఎనిమిది డివిజన్‌లు, 11 గ్రామాలలో దీపావళిని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఇంట్లో నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సోదర సోదరీమణులు హారతులను సోదరులకు ఇచ్చి స్వీట్లను తినిపించారు. సాయంత్రం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా టపాకాయలను పేలుస్తూ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలను తెలుపుకున్నారు.
బొంరాస్‌పేట: మండలంలో దీపావళి పండుగ పర్వదినాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లల్లో, వ్యాపార సముదాయాల్లో లక్ష్మీపూజలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మూలంగా టపాసుల మోత తక్కువగా వినిపించింది. టపాసుల ధరలు ఆకాశన్నంటడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు.
తలకొండపల్లి: మండలం కేంద్రంతోపాటు గ్రామాల్లో ధీపావళి పర్వదిన పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకించి నోమువ్రతాలు ఉన్నవారంత తమ ఇళ్లలో పురోహితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీదేవి పూజలతో పాటు కేదారీశ్వర, సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. బాణాసంచ కాల్చి సందడి చేశారు.
షాద్‌నగర్: దీపావళి పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం షాద్‌నగర్ పట్టణంలోని వివిధ కాలనీల్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వ్యాపార యజమానుల మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి పండగ సందర్భంగా షాద్‌నగర్ పట్టంలోని టపాసుల దుకాణాలు జనసంద్రంగా మారిపోయాయి.
కొందుర్గు: దీపావళి పండగ సంబరాలను కొందుర్గు మండల కేంద్రంతో పాటు ముట్పూర్, రేగడిచిల్కమర్రి, తంగెలపల్లి, అగిర్యాల, తదితర గ్రామాల్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంతో పాటు తుమ్మలపల్లి, చౌదరిగూడెం, ఇంద్రానగర్, పెద్దఎల్కిచర్ల, గాలిగూడ తదితర గ్రామాల్లో దీపావళి వేడుకలు కన్నులపండువగా జరుపుకున్నారు.
కొత్తూరు: విద్యుత్ దీపాలంకరణ చేసి దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో దీపావళి పండగను భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్‌లో దీపావళి పండుగ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య టపాసులు, వివిధ రకాల బాణాసంచ పేలుస్తూ వేడుకలను నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించి వ్రతాలు చేశారు. యాదవ కులస్థులు బుధవారం రాత్రి సదర్ ఉత్సవాలను నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద సదర్ ఉత్సవాలను మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు అబ్బసాని అంజయ్య యాదవ్, దాసరి శంకరయ్య, మామిళ్ల కొమురయ్య, రాజబోయిన యాదగిరి యాదవ్, మామిళ్ల ముత్యాలు యాదవ్, గాజుల కృష్ణ యాదవ్, మామిళ్ల చిత్తారి యాదవ్, అబ్బసాని యాదగిరి యాదవ్ పాల్గొన్నారు.