హైదరాబాద్

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల విధుల నిర్వాహణలో ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌తో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ సూచించారు. ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో సుమారు 10వేల మందికి మొదటి దశ శిక్షణ కార్యక్రమం జరిగింది. సికిందరాబాద్ హరిహర కళాభవన్, బంజారాహిల్స్, ముఫకంజ కాలేజీల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాల్లో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు పలు చైతన్య కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వాహణలో 23వేల మంది సిబ్బంది నేరుగా పాల్గొంటున్నారని, దీంతో పాటు మరో పదివేల మంది పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది హాజరవుతున్నారని వివరించారు. ఎన్నికల నిర్వాహణ అనేది ప్రతి సారి కొత్తగానే ఉంటుందని, ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ప్రతి అంశాన్ని లిఖితపూర్వక ఆదేశాలు ఉంటాయని తెలిపారు. ఈసారి ఎన్నికల నిర్వాహణలో వీవీప్యాట్‌లను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వాహణ పరంగా హైదరాబాద్ జిల్లా అత్యంత సున్నిత ప్రాంతమని, ఏ చిన్న సమస్య తలెత్తినా మీడియాలో దాని ప్రభావం పెద్దగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎన్నికలు నిస్పక్షపాతంగా, పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించామని వివిధ పార్టీలు, అభ్యర్థులు నిర్దారించేలా ఎన్నికల నిర్వాహణ ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా ఎన్నికల వ్యయం పరిశీలకులు ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చారని, సాధారణ పరిశీలకులు ఈనెల 19న రానున్నట్లు తెలిపారు. ఎన్నినల విధుల నిమిత్తం నియమితులైన ఉద్యోగులంతా సక్రమంగా విధులు నిర్వర్తించాలని, గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరోసారి హెచ్చరించారు.
వెబ్ కాస్టింగ్‌లో పాల్గొనాలి
* విద్యార్థులకు డీఈఓ పిలుపు
త్వరలో జరగనున్న పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేసేందుకు ఆసక్తి ఉన్న సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుకు రావాలని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ పిలుపునిచ్చారు. ఆసక్తి కలిగినవారు తమ పేర్లను జీహెచ్‌ఎంసీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. సొంత ల్యాప్‌ట్యాప్ కలిగిన అభ్యర్థులు జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చునని, ఇందులో పాల్గొనే వారికి తగిన పారితోషికం ఇవ్వటంతో పాటు సర్ట్ఫికెట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 6309920631, 6309981289ను సంప్రదించాలని సూచించారు.

అడ్డంకులు ఏమిటీ.. ఎలా పరిష్కరించాలి
* ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీపై సమన్వయ సమావేశం

హైదరాబాద్, నవంబర్ 14: మహానగరంలోని మెయిన్‌రోడ్లే గాక, సబ్ రోడ్లలో కూడా రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నగరంలోని పలు మెయిన్‌రోడ్లలో ఇప్పటికే ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కింద ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు, స్కైవేలు నిర్మిస్తుంది. ఆనంద్‌బాగ్‌లో నిర్మించేందుకు ప్రతిపాదించిన ఆర్‌యూబీ నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ప్లానింగ్ విభాగం డైరెక్టర్ శ్రీనివాస రావు, చీఫ్ ఇంజనీర్ శ్రీ్ధర్, రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, జలమండలి జీఎం, సీజీఎంలతో పాటు రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆర్‌యూబీ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ, ఆ మార్గంలో భూగర్భంలో ఉన్న వాటర్, డ్రైనేజీ, ఇతర కేబుల్ వంటి వౌలిక సదుపాయాల బదిలీ వంటి అంశాలపై అధికారులు బృందం చర్చించింది. వీలైనంత వేగంగా స్థల సేకరణ పూర్తి చేయాలని, ఒకసారి పనులు ప్రారంభించిన తర్వాత ఆటంకం ఏర్పడకుండా ఉండేలా వౌలిక సదుపాయల బదిలీ పనులు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఆర్‌యూబీని నిర్మిస్తే ఈ రహదారికి సమాంతరంగా పరిసర ప్రాంతాల్లోని రహదారుల్లో ట్రాఫిక్ సమస్య తగ్గి, రాకపోకలు వేగవంగా ముందుకు కదిలే ఆస్కారమేర్పడుతోందని అధికారుల బృందం అభిప్రాయపడింది. ఆర్‌యూబీకి అవసరమైన డిజైనింగ్‌ను రైల్వే శాఖ రూపొందించే అంశంపై కూడా అధికారుల బృందం చర్చించింది.

ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన
కాచిగూడ, నవంబర్ 14: చాచా నెహ్రూ 129 జయంతి సందర్భంగా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో ‘బాలల దినోత్సవ సంబురాలు’ బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఇందిరాగాంధీ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత డా.చిక్కా దేవదాసు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సాయి శాంతి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎర్రపూర్ణ శాంతి, నృత్య గురువు వాణి రమణ, సంస్థ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ పాల్గొని చిన్నారి కళాకారులను అభినందించి సత్కరించారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.