హైదరాబాద్

మహాకూటమికి కరెంట్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాలు తారుమారయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక శాతం కైవశం చేసుకున్న పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయాలు నిజమయ్యాయి. ఎన్నికల ముందు నుండి ఊహించినట్టుగానే ఒకటి రెండు మినహా అన్ని అనుకున్నట్టుగానే పగడ్బందీ వ్యూహంతో అధికార పార్టీ పావులు కదిపింది. తాండూరు, కొడంగల్, వికారాబాద్, ఎల్బీనగర్, మహేశ్వరం, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగిలిన స్థానాలన్నీ టీఆర్‌ఎస్ కైవశం చేసుకుంటుందన్న అంచనాల్లో కొడంగల్, ఉప్పల్ మినహా అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. దీనికి ప్రధానంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరంతర విద్యుత్ సరఫరా, పింఛన్ల పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలాల క్రమబద్దీకరణ, డెబుల్ బెడ్‌రూమ్ దరఖాస్తుదారులు తూ.చ. తప్పకుండా టీఆర్‌ఎస్ పార్టీకే మద్దతు తెలిపినట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా భారీ మెజారిటీలతో కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ, మేడ్చల్, షాద్‌నగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. నువ్వా, నేనా అన్నట్టుగా ఎల్బీనగర్‌లో తొలుత కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ అభ్యర్థి రాంమోహన్‌గౌడ్‌కు పోటీ జరిగినా 10 రౌండ్ల అనంతరం కాంగ్రెస్‌కు మెజారిటీ రౌండ్ రౌండ్‌కు పెరుగుతూ చివరకు సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. అలాగే తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాల సైతం కాంగ్రెస్ అభ్యర్థులు రోహిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు అంతే స్థాయిలో పోటీపడి విజయం సాధించారు. చివరి రౌండ్ వరకు పోరాటం చేసి కేవలం 481 ఓట్ల మెజారిటీతో ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. కల్వకుర్తి, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.