హైదరాబాద్

దేవాలయాల్లోకి మహిళల ప్రవేశంపై విస్తృతస్థాయి చర్చ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ప్రిల్ 14: దేవాలయాల్లోకి మహిళల ప్రవేశంపై దేశంలో విస్తృతస్థాయి చర్చ జరగాలని ఆచార్యులు విష్ణ్భుట్ల వెంకట లక్ష్మీనరసింహ నారాయణప్రసాద్ అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శింగనాపూర్ శనైశ్చర దేవాలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించడం తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నారు. ఆగమ శాస్త్ర నియమనిబంధనల ప్రకారం హిందూ దేవాలయాలు కొనసాగుతుంటాయని, సనాతన ధర్మానికి, ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రవేశానికి అనుమతించడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు జరిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగమశాస్త్రాలను రుషులు ఎంతో కాలం శోధించి శాస్ర్తియ ప్రాతిపదికపై ఏర్పాటు చేశారని అన్నారు. వాటిని అర్ధం చేసుకొని తెలుసుకోవడం తప్ప మార్చే అర్హత ప్రస్తుత తరానికి లేదని చెప్పారు. ఆలయ ప్రవేశానికి, గర్భాలయ ప్రవేశానికి మధ్య తేడా ఉంటుందని, దీనిని గుర్తించి ఆనాటి సనాతన ధర్మకర్తలు కొన్ని నిబంధనలు పాటించాలని సూచించారని చెప్పారు. సామాన్య ప్రజాభిప్రాయం అన్న పేరు మీద జరుగుతున్న ఈ దురాచారాలను అరికట్టి, దీనిపై పూర్తిస్థాయిలో చర్చకు వీలుకల్పించాలని కోరారు. దేవాలయ నిర్మాణ, నిర్వహణా విధానాలలోని శాస్ర్తియతను కూలంకషంగా చర్చించి, తప్పొప్పులను సవరించాలని కోరారు. అదే సమయంలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు