హైదరాబాద్

అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణ రాష్ట్ర దేశానికే ఆదర్శమని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కమ్యూనికేషన్, బిజినెస్, సర్వీస్, ఐటీ రంగాలకు చెందిన యువ నిపుణుల బృందం గురువారం మేయర్‌ను కలిసింది. వారితో ప్రత్యేకంగా సమావేశమై జీహెచ్‌ఎంసీ నగరవాసులకు అందిస్తున్న సేవలను, నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను కమిషనర్ దాన కిషోర్‌తో కలిసి వివరించారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి తెలిపారు. సరికొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే విప్లవాత్మక పథకాలను అమలు చేయటంతో మొత్తం దేశం దృష్టి తెలంగాణపై పడిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేసిన ఏకైక రాష్ట్రంగా పేరుగాంచిందని పేర్కొన్నారు. అతిపెద్ద నీటి పారుదల ఎత్తిపోతల పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యారంగంలో ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలు, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎన్నో కార్యక్రమాలను తీసుకున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తుందని, ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.9వేల కోట్ల వ్యయంతో లక్ష ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ నుంచి వాహనదారులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టి, నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.12వేల కోట్లతో ఫ్లైఓవర్లు, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, స్కైవేలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు మంచినీటి కొరతతో అల్లాడిపోయిన నగరానికి రానున్న 50 ఏళ్ల వరకు నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మేయర్ తెలిపారు. ప్రపంచంలోనే నివాసయోగ్యమైన రెండో సిటీగా పేరుగాంచిందని వెల్లడించారు. సాంప్రదాయక వీధిదీపాల స్థానంలో ఏకంగా 4.20 లక్షల ఎల్‌ఇడీ లైట్లను అమర్చామని, ఇది రికార్డు సమయంలో మార్చినట్లు తెలిపారు. దీంతో 35 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేశామని తెలిపారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఫార్మా మందుల్లో మూడవ వంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, ఫార్మా ఇండస్ట్రీని సుమారు ఐదువేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.