హైదరాబాద్

నిలకడగా మహేశ్వరి ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన మంగళ్‌హాట్ పూసలబస్తీకి చెందిన హర్షవర్ధన్ చౌదరి భార్య మహేశ్వరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆపరేషన్ అనంతరం వైద్యులు కడుపులో కత్తెర మరవడంతో కొంత కాలంగా ఆమె తీవ్ర బాధకు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి తట్టుకోలేని విధంగా కడుపు నొప్పి రావడంతో బంధువులు ఆమెను తిరిగి నిమ్స్‌కు తీసుకువచ్చారు. ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులకు సమస్య ఏమిటో అర్ధం కాలేదు. దీంతో ఎక్స్‌రే తీయమని సూచించగా కడుపులో కత్తెర ఉందని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోగి బంధువులు ఆందోళనకు దిగడంతో హుటాహటిన ఆమెకు శనివారం ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం సుమారు మూడు గంటలపాటు శ్రమించి ఆమెకు శస్తచ్రికిత్స నిర్వహించి కడుపులోని కత్తెరని తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.