హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందక ఉప్పల్‌కు చెందిన హరినాథరెడ్డి అనే వ్యక్తి ఆసుపత్రి ఎదుట మృతి చెందాడు. దీంతో గాంధీ ఆసుపత్రి ఎదుట హరినాథరెడ్డి బంధువులు ఆందోళనకు దిగారు. రోగిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. దాదాపు నాలుగు గంటలపాటు చికిత్స కోసం ఆసుపత్రి ఎదుట నిరీక్షించినా సిబ్బంది కనికరించలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కళ్లముందే హరినాథరెడ్డి మృతి చెందాడని, ఆయన మృతికి కారకులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.