హైదరాబాద్

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : అంతర్గతంగా చక్కటి సమన్వయంతో పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల కృషి కారణంగా పదిరోజుల వ్యవధిలోనే బల్దియాకు రెండు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు రావటం పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం నగరాన్ని ఓడీఎఫ్++గా స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రకటించగా, బాండ్ల జారీకి సంబంధించి ఎస్‌బీఐ క్యాపిటల్ జీహెచ్‌ఎంసీకి ఏఏ+ రెటింగ్ ఇచ్చింది. తాజాగా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ నగరానికి ప్రకటించిన స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కమిషనర్ శుక్రవారం న్యూ డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లో హర్షం వ్యక్తం చేశారు. పది లక్ష జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ పురస్కారం దక్కింది. స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా నగరంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించటానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు బల్దియా అధికారులు తెలిపారు. కేవలం పదిరోజుల వ్యవధిలోనే రెండు పురస్కారాలు రావటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సర్వేక్షణ్ 2019లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తామని కమిషనర్ అన్నారు.
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి
హైదరాబాద్, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో రాంజీ నాయక్ తండాలో జన్మించిన సేవాలాల్ గొప్ప సంస్కర్తగా గిరిజనుల ఆరాధ్యుడై, ఆ కాలంలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న బంజారుల అలవాట్లు, ఆచార వ్యవహరాల్లో మార్పులు తెచ్చి వారు ప్రగతి బాటన పయనించేలా చేసిన మహానీయుడు. ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని మాలకుంట ట్రైబల్ బస్తీలో సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్, హైదరాబాద్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వీ.నాగలక్ష్మి, నాంపల్లి తహశీల్దార్ నిర్మళ, కార్పొరేటర్ల్ శంకర్ యాదవ్, పరమేశ్వరి, వయోజన విద్య ఏపీఓ బీ.సిద్ధిరామ్ రెడ్డి, సూపర్‌వైజర్ మురళి మోహన్ పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో..
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జీ.రవి ముఖ్యఅతిథిగా విచ్చేసి సంత్ సేవావాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. సేవాలాల్ ఆశయాలకు కట్టుబడి ప్రభుత్వం అందిస్తున్న పతకాలను బంజారాలు ఆర్థిక స్వాలంభన దిశగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బంజారాల అభివృద్ధికి సంత్ సేవాలాల్ మహారాజ్ విశేష కృషి చేశారని చేశారని గుర్త చేశారు.