హైదరాబాద్

రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన ఆఫ్ ఇండియా (క్రీడాయ్) ప్రాపర్టీ షో ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమల తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరమని, ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పరిశ్రమలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు, అంతర్జాతీయ విద్యాసంస్థలకు మారుపేరుగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రణాళికాబద్ధంగా రోడ్ల నిర్మాణం జరుగుతోందని, మెట్రో రైల్ కనెక్టివిటీ ప్రధాన ప్రాంతాలకు కల్పించామని అన్నారు. క్రీడాయ్ చేపట్టిన ప్రాజెక్టులతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో క్రీడాయ్ అధ్యక్షుడు ఎస్. రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ పీ. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడారు.