హైదరాబాద్

తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు భాషను విశ్వవాప్తం చేయాలని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ డా.నందిని సిధారెడ్డి అన్నారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా లక్ష్య సాధన ఫౌండేషన్, తెలుగు భాష చైతన్య సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మలుగు అంజయ్య అష్టావధాన కార్యక్రమం ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనం చాటిచెప్పాలని అన్నారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు బడేసాబ్, లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞరాజు, రాజ్‌గోపాల్ నాయుడు పాల్గొన్నారు.

సుభాష్‌కు స్వరకిరీటి బిరుదు ప్రదానం
కాచిగూడ, ఫిబ్రవరి 17: ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవరస గాయనీ ఆమని నిర్వహణలో దశగాయక స్వరావిష్కరణ పేరిట సినీ సంగీత విభావరి ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వైకే నాగేశ్వర రావు పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన గీతాలు అలరించాయి. ప్రముఖ గాయకుడు సుభాష్‌కు స్వరకిరీటి బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ గాయని శశికళ, శృతిలయ చైర్మన్ ఆర్‌ఎన్ సింగ్, ప్రొగ్రామ్ కోఅర్డినేటర్ జీసీ శేఖర్ పాల్గొన్నారు.