హైదరాబాద్

కళలతో మానసిక ఉల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: కళలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మల్కాజిగిరి జడ్జి జస్టిస్ బూర్గుల మధుసూదన్ అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి కుందనికకు ‘కళారత్న’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఉజ్వల సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, సుస్వర సుగుణ కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బూర్గుల మధుసూదన్ మాట్లాడుతూ తెలంగాణ కళలను కాపాడుకోవాలని సూచించారు. ఉజ్వల సంస్థ నిస్వార్ధంగా చేస్తున్న సేవలను అభినందించారు. కుందనిక ప్రదర్శించిన మహిషాసురవర్ధిని నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వెజ్‌మెన్ క్లబ్ పూర్వ క్షేత్ర అధికారి వైఎస్‌ఆర్ మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ఉజ్వల అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, సంస్థ కల్చరల్ కోఅర్డినేటర్ కురుగంటి రాధిక, సుస్వర అధ్యక్షుడు రవిమన్యు పాల్గొన్నారు.