హైదరాబాద్

‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు సమగ్ర పరిశీలన’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 17: ప్రముఖ రచయిత డా.ఆర్.సూర్యప్రకాశ రావు రచించిన ‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన’ సిద్ధాంత గ్రంథావిష్కరణ సభ ప్రభాతశశి సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శక నిర్మాత బి.నరసింగరావు పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. అమ్మంగి వేణుగోపాల్ రచనలపై సమగ్రంగా సాగిన పరిశోధన గ్రంథామని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలియైన అమ్మంగి వేణుగోపాల్‌పై పరిశోధనకు సూర్యప్రకాశ్ కూడా బహుముఖీనంగా పరిశ్రమించాడని తెలిపారు. ఒక ప్రమాణ పరిశోధనకుణి మెప్పించి పరిశోధన చేయడం ఎంతో కష్ట సాధ్యమైందని చెప్పారు. సిద్దాంత గ్రంథం ఎనిమిది కోణాల్లో విశే్లషించారని తెలిపారు.
తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అచార్యులు ప్రొ.జి.చెన్నకేశవరెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకుడు డా.కె.శ్రీనివాస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ప్రొ.వెలుదండ నిత్యానందరావు, వివిధ రంగల ప్రముఖులు ఆచార్య ఎం.గోనానాయక్, డా.తూర్పు మల్లారెడ్డి, టిఎన్‌జిఓ సంఘం గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్, జి.గోపాలరెడ్డి, డా.ఏనుగు నరసింహరెడ్డి, కెపి అశోక్‌కుమార్, డా.నోముల సత్యనారాయణ, పి.లక్ష్మీనారాయణ, వేణు సంకోజు, గంటా జలంధర్‌రెడ్డి, డా.అమ్మంగి వేణుగోపాల్ పాల్గొన్నారు.