హైదరాబాద్

కిలో బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట దొంగలను ఈస్ట్‌జోన్, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి అర కిలో బంగారు, కిలోన్నర వెండి ఆభరణాలతోపాటు రూ. 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈస్ట్‌జోన్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిసి రవీందర్ వెల్లడించిన వివరాలిలావున్నాయి. రాజస్తాన్‌కు చెందిన భరత్‌కుమార్ మోతీలాల్ (27) హక్మారామ్ చౌదరి అలియాస్ కైలాష్ (27) దినేష్ కుమార్ (39) అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఫిదా హుస్సేన్ (24) ఇక్బాల్ (31) చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరు నగరంలో మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్‌లుగా ఉన్నారు. వీరిపై నగరంలోని ఐదు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. బేగంబజార్, అఫ్జల్ గంజ్, కాచిగూడ పోలీసు స్టేషన్లలో చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి కేసులు, పలు ఇళ్లలో దోపిడీకి పాల్పడిన కేసులు ఉన్నాయి. భరత్‌కుమార్ తన ముఠా సభ్యులతో హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీలలో ఇళ్ళ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరిపై 16 కేసులు నమోదు కాగా మోస్ట్‌వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. కాగా మంగళవారం ఓ ఇంట్లో జరిగిన చోరీపై దర్యాప్తు చేస్తుండగా వీరు ఈస్ట్‌జోన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. భరత్‌కుమార్, కైలాష్, దినేష్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్టు అంగీకరించారని, వారి నుంచి అర కిలో బంగారం, కిలోన్నర వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు. వీరిపై పిడి యాక్టు పెట్టనున్నట్టు ఆయన వివరించారు. నిందితులను పట్టుకున్న మలక్‌పేట ఎసిపి సుధాకర్, కాచిగూడ ఎసిపి లక్ష్మినారాయణ, ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ ఇనె్స్పక్టర్ శ్రీ్ధర్, సుధాకర్, రవికుమార్, శ్రీనివాస్, నాగేశ్వరరావులను ఆయన అభినందించారు.