హైదరాబాద్

శాస్ర్తియ సంగీతాన్ని ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: శాస్ర్తియ సంగీతాని ప్రోత్సహించడం అభినందనీయమని ప్రముఖ సాహితీవేత్త డా.పాలకుర్తి మధుసూదన రావు అన్నారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘శాస్ర్తియ సంగీత’ మహోత్సవం బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మధుసూదన రావు మాట్లాడుతూ శాస్ర్తియ సంగీతానికి ఎంతో అదరణ ఉందని పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు శాస్ర్తియ సంగీత మహోత్సవం నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. ప్రముఖ గాయనీ వెంపటి శ్రీవల్లి శర్మ అలపించిన శాస్ర్తియ సంగీతం అలరించింది. ప్రముఖ అధ్యాత్మికవేత్త ఏఎస్ మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ కార్యదర్శి మద్దాళి రాఘురామ్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఏప్రిల్ 17: శ్రీసాయి సంగీత లహరి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి బుధవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దైవజ్ఞశర్మ, కినె్నర కార్యదర్శి మద్దాళి రఘురామ్, సంస్థ అధ్యక్షుడు రామ ప్రసాద్ పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గాయనీ, గాయకులు ప్రభాకర రావు, శ్రీనివాస్, ఉమా మహేశ్వరి, సుబ్రహ్మణ్యం, నాగమణి, పద్మజ, విజయ, రజని, లక్ష్మీ, మాధవి, మంజుల, సరోజ అలపించిన సినీ గీతాలు అలరించాయి.