హైదరాబాద్

నీటి సంరక్షణకు జలసైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వృథాగా పోతున్న మంచినీటిని పొదుపు చేసేందుకు జలమండలి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జల నాయకత్వం, నీటి సంరక్షణ (వాక్) కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. నగర ప్రజల్లో నీటి పొదుపు పట్ల, నీటి వృథాని ఎలా అరికట్టవచ్చునో అవగాహన కల్పించేందుకు జలమండలి సుమారు 15వేల మంది వాలంటీర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ప్రతిపాదించింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలోని 150 వార్డుల్లో వార్డుకు కనీసం వంద మంది వాలంటీర్స్ చొప్పున ఆరు జోనల్ కమిషనర్స్ పరిధిలోని 150 వార్డుల్లో వార్డుకు కనీసం వందకు తగ్గకుండా వాలంటీర్స్‌ను నియమించి ప్రజలల్లో నీటిపొదుపుపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించేందుకు జలమండలి సిద్దమైంది. 150 డివిజన్‌ల్లో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్స్, జలమండలి డైరెక్టర్స్, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలతో కలిపి నగర ప్రజల్లో నీటి వృథాను అరికట్టడం, నీటి పొదుపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే విధంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం కోసం ముందుకు వచ్చే వాలంటీర్లతో ప్రజల్లో అవగాహన కల్పించాలని జలమండలి యోచిస్తోంది. స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు, సమాజంలో అన్ని వర్గాల ప్రజల సహాకారం తీసుకోనున్నారు. వాక్ కమిటీ సభ్యులు ప్రతి వారానికి ఒకసారి సమావేశమై నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తారు. నీటిపొదుపుపై వీరు ప్రజలతో చర్చించనున్నారు. దిన చర్యలో చేసే చిన్నపాటి మార్పులతో ప్రతి కుటుంబం రోజుకు 300 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. నీటి లీకేజీలను అరికడితే, నీటిని పొదుపు చేసినట్లే. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి నీటిపొదుపుపై అవగాహన కల్పించేందుకు పూర్తిస్థాయిలో 20వేల మంది వాలంటీర్లు సన్నదంగా ఉంటారని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ పేర్కొన్నారు. మంచినీటి విలువను నగర ప్రజలకు వివరించేందుకు ఈనెల 22న ఎర్త్ డేను పురస్కరించుకుని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద వాటర్ బోర్డు అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లు, ఏన్జీవోల ప్రతినిధులు, వాక్ బృందాలు ఏడాది పొడవునా నగరవాసులతో మమేకమై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, బోర్డు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ ఇతర డైరెక్టర్లు వీఎల్.ప్రవీణ్ కుమార్, శ్రీ్ధర్ బాబుతో కలిసి వాక్ కమిటీలతో సమావేశమై పలు సూచనలు సలహాలివ్వడం జరుగుతుంది. నీటిని పొదుపుగా వాడుకుంటే అది భవిష్యత్ తరానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని ప్రజల్లో నాటుకుపోయోల ప్రచారం చేయాలని ఎండీ సూచించారు. నీటిపొపులో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ప్రజల నుండి మంచి స్పందన లిభిస్తోందని జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ బీ.శ్రీ్ధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే అసక్తి గల వారు సెల్ ఫోన్ నెంబర్ 9100108462, 7995089083, 998995102లో సంప్రదించాల్సి ఉంటుందని జలమండలి పేర్కొంది.