హైదరాబాద్

పౌరుల భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పౌరుల భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అభిప్రాయపడ్డారు. సాఫ్ హైదరాబాద్ - షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికను ఆయన క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, ఆ తర్వాత ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం చాలా మెరుగుగా ఉందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులెంతో మంది అభినందించారని వివరిస్తూనే, దీన్ని మరింత మెరుగుపరిచేందుకే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వ శాఖ ఎంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకున్నా, అది ప్రజల సహకారముంటేనే విజయవంతమవుతోందని వివరించారు. 1వ తేదీ నుంచి నగరంలో ఈ సాఫ్ హైదరాబాద్ - షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి ప్రాంతంలో నిబద్దతతో పనిచేసే కనీసం వంద మంది వాలంటీర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్‌లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధునలు వాలంటీర్లుగా నియమించాలని సూచించారు. వాలంటీర్లను ఛేంజ్ లీడర్లుగా మారేందుక వీలుగా శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. నగరవాసుల్లో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉన్నందున, భిన్న మతాలకు చెందిన మత పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు వారిచే నగరవాసుల్లో చైతన్యాన్ని నింపనున్నట్లు తెలిపారు. ఈ రకంగా సుమారు ఐదు వేల మంది మత పెద్దలతో మే మొదటి వారంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో దానిలో 2500 ఇళ్లను ప్రత్యేక ప్రాంతంగా, మొత్తం 3లక్షల 75వేల ఇళ్లను ఎంపిక చేసి తొలి విడత కార్యక్రమాన్ని చేపట్టి నెలరోజుల్లోపు వంద శాతం సంపూర్ణ స్వచ్ఛతను సాధించటానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని కమిషనర్ వివరించారు. ప్రతి లొకేషన్‌కు ఒక గెజిటెడ్ అధికారిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ నోడల్ అధికారి అధ్యక్షతన లొకేషన్‌కు కేటాయించిన ఇంజనీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా స్వచ్చ కార్యకర్తలు, ఎస్‌ఎఫ్‌ఏలు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, వారి సహాయకులతో ప్రతి రోజు సమావేశమై సంపూర్ణ స్వచ్ఛతను సాధించేందుకు నిర్దేశించిన 18 అంశాల పురోగతిపై సమీక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటల్లోపే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవల్సి ఉంటుందని కమిషనర్ సూచించారు. ర్యాంక్‌లు, అవార్డులు ప్రధానం కాదని, నిరంతర స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించటమే ముఖ్య అంశమని కమిషనర్ వివరించారు.