హైదరాబాద్

పారదర్శకతతో పారిశుద్ధ్య పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను మరింత పకడ్బందీగా, పారదర్శకతతో నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగర వాసుల్లో పరిశుభ్రత, స్వచ్ఛతతో పాటు జల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 18వ తేదీన 6వేల మందితో వాటర్ హార్వేస్టింగ్ డే ను నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. బుధవారం ఆయన నగరంలోని కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లోని భరత్‌నగర్‌కాలనీ, కూకట్‌పల్లిలోని జలవాయు విహార్ కాలనీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత భరత్‌నగర్ కాలనీని సందర్శించిన కమిషనర్ అక్కడ శానిటేషన్ కార్యక్రమాలపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పనులను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీటిని వదలుతున్న ఇంటిని గురించి, యజమానికి హెచ్చరించారు. కాలనీ అంతర్గత రహదారుల్లో ఉన్న నిర్మాణ వ్యర్థాలు, గ్యార్బేజీనీ తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా భరత్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన సాఫ్ హైదరాద్-షాన్ హైదరాబాద్ కార్యక్రమంలో నగరంలోని 150 వార్డుల్లో 150 లొకేషన్లను ఎంపిక చేసి, జూలై మాసం చివరి కల్లా సంపూర్ణ స్వచ్ఛత సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, మహిళా కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. భరత్‌నగర్ కాలనీలో జీహెచ్‌ఎంస ఈకి చెందిన వెయ్యి గజాల ఖాళీ స్థలం అన్యక్రాంతం అవుతుందని కాలనీ వాసులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో ఈ స్థలాన్ని వెంటనే పరిశీలించిన తగిన చర్యలు చేపట్టాలని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. భరత్‌నగర్ కాలనీలో వీది ధీపాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఆ తర్వాత జలవాయు విహార్ కాలనీని ఆయన సందర్శించారు. మోడల్ కాలనీగా ఉన్న ఈ కాలనీలో వర్షపు నీరు వృథాగా పోకుండా నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. ఈ నెల 18వ తేదీన వాటర్ హార్వేస్టింగ్ డే ను నిర్వహించటంతో పాటు నగరంలోని అన్ని ఇంకుడు గుంతలకు మరమ్మతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లుగా నమోదైన ఆరు వేల మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. త్వరలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు మొక్కలను నాటి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.