హైదరాబాద్

రేపే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ప్రథమ వర్థంతి సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, పౌర హ క్లు వాది, సోషలిస్టు నాయకుడు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ప్రథమ వర్థంతి సభ 17వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతుంది. ఈ సభలో తెలంగాణ జనపరిషత్ కన్వీనర్ వలిగొండ విజయరాజు, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క, పాశం యాదగిరి, జీవన్ కుమార్, గోరేటి వెంకన్న, ఏ నారాయణ్, సయ్యద్ రఫీ, గోపాల్ రెడ్డి, అందెశ్రీ, జయరాజు, ఏంఏ ముజిబ్ పాల్గొంటారు. ప్రత్యేక అతిథులుగా రిటైర్డు జడ్జి టీ గోపాల్ సింగ్, సోషలిస్టు నేత రావెల సోమయ్య పాల్గొంటారు.
అరుణా సుబ్బారావుకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జూన్ 15: ప్రముఖ జానపద కళాకారిణి అరుణా సుబ్బారావుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆనంద లహరి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సినీ దర్శకుడు ఆదిత్య, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, చంద్రముఖి చంద్రశేఖర్, కళారత్న మల్లం రమేష్ పాల్గొని అరుణా సుబ్బారావుకు ఆత్మీయ సత్కారం చేశారు. పేరడీ గీతాలతో అత్యంత ప్రావీణ్యత పొంది ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన అరుణ ప్రముఖుల ప్రశంసలు అందుకుందని పేర్కొన్నారు. ఆమెకు ఆత్మీయ సత్కారం చేసి గౌరవించుకోవడం సంతోషదాయకమని అన్నారు.