హైదరాబాద్

మియాపూర్‌లో ‘సాఫ్-షాన్‌దార్ హైదరాబాద్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, శేరిలింగంపల్లి: మహానగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో 50 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ కవర్లను నిషేధించామన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ఈ నిషేధం ఖచ్చితంగా అమలయ్యేలా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధించేందుకు, మరింత పరిశుభ్ర పరిచేందుకు నిర్వహిస్తున్న ‘సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా మియాపూర్‌లో శనివారం జరిగిన కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఏరివేత కోసం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు సుమారు 200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించామని తెలిపారు. నగరంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు, వర్షపునీటిని భూమిలో ఇంకేలా జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్త్ధ్వార్యంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమంలో అందర్నీ భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను మొదటి విడతలో నగరంలోని 150 వార్డుల్లో 2500 ఇళ్లను ఒక లొకేషన్‌గా ఏర్పిటు చేసి, ఆయా లొకేషన్‌గా ఏర్పాటు చేసి, ఆయా లొకేషన్‌గా ఏర్పాటు చేసి ఆయా లొకేషన్‌కు ఒక స్వచ్చంద సంస్థ, ఒక ప్రత్యేక అధికారిని నియమించిన వంద శాతం స్వచ్ఛత సాధించేందుకు సాఫ్, షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎం.ఏ.కాలనీ సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో కాలనీలోని మహిళా స్వయం సహాక బృందాలచే తయారు చేసిన జ్యూట్, పేపర్ బ్యాగ్‌ల స్టాల్‌లను పరిశీలించి మహిళలను అభినందించారు. ఈ బ్యాగ్‌ల వాడకాన్ని ప్రతి కాలనీలో ప్రతి వీక్లీ మార్కెట్లలో విస్తత్రంగా పంపిణీ చేసి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని ప్రతి కాలనీ ప్రతి వీక్లీ మార్కెట్‌లో విస్తత్రంగా పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కమిషనర్ సూచించారు. చెత్తను తడి,పొడిగా వేరు చేసే అంశంపై కూడా వివరించారు. చెత్తతో ఎరువులను తయారు చేసుకునే కంపోస్టు పిట్‌లను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియపై అందరూ అవగాహన వంతులై పూర్తి స్థాయిలో వినియోగిస్తే చెత్తను నిల్వ చేసుకునే జవహర్‌నగర్ డింపింగ్ యార్డు అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.