హైదరాబాద్

‘నేతన్నలను చైతన్య పరిచేలా ప్రతిక’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: నేతన్నలను చైతన్య పరిచేలా నూలు పౌర్ణమి మాస పత్రిక వెలువడాలని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు సూచించారు. సీనియర్ పాత్రికేయుడు, ప్రతిక ఎడిటర్ కోడం పవన్ కుమార్ సంపాదకత్వంలో వెలువడుతున్న నూలు పౌర్ణమి మాస పత్రిక పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా బీఎస్ రాములు, రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా ఏవిధంగా అభివృద్ధి చెందాలో ఈ మాస పత్రిక మార్గనిర్ధేశం చేయాలని కోరారు. నూలు పౌర్ణమి నేత కార్మికుల ఆత్మాభిమానం, అస్థిత్వానికి ప్రతి రూపంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7 నాటికే ఈ పత్రిక అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, రఘునందన్, మార్త రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.