హైదరాబాద్

ముంపు నివారణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినపుడు మహానగరాన్ని ముంపు నుంచి రక్షించేందుకు జీహెచ్‌ఎంసీ కాస్త ముందు చూపుతో వ్యవహారిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశాముందంటూ హెచ్చరికలు వచ్చినపుడే ముంపునకు గుర్తయ్యే ప్రాంతాలకు అత్యవసర బృందాలు, సహాయ చర్యల నిమిత్తం వివిధ విభాగాలకు చెందిన మొత్తం 495 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, మరో 153 మాన్సూన్ రెస్పాండ్ టీంలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 495 టీంలను జీపీఆర్‌ఎస్ విధానంతో అనుసంధానం చేయనున్నారు. భారీగా నీరు నిలిచే వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్దకు సంబంధించి ప్రత్యేకంగా సిబ్బందిని పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మహానగరంలో ఉన్న డ్రైనేజీ, వరద నీటి కాలువలు గంటకు కేవలం రెండు సెంటీమీటర్ల వర్షపాతానికి మాత్రమే ట్టుకునే సామర్థ్యం కల్గి ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో నగరంలో తక్కువ సమయంలో పది నుంచి 11 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురుస్తుండటంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిని దూరం చేసేందుకు వర్షం కురవక ముందే అత్యవసర బృందాలు సిద్దంగా ఉంటే వర్షం కురుస్తున్నపుడే నీరు సక్రమంగా ప్రవహించేందుకు వీలుగా ఏర్పాటు చేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను మొత్తం 160 ముంపు ప్రాంతాలను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ముందస్తుగా మోటార్లను ఏర్పాటు చేసి ఎప్పటికపుడు నీటిని తోడేస్తే వర్షం ఆగిన తర్వాత వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ముంపు ప్రాంతాలకు సంబంధించి ఒక్కో కిలోమీటరుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఎప్పటికపుడు సహాయక చర్యల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు.
ఐటీ కారిడార్‌లో ఈ రకంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నీటిని తోడేసి, వాటిని శిల్పారామం చెరువులోకి మళ్లించనున్నట్లు తెలిపారు. విపత్తులను సత్వరమే ఎదుర్కొనేందుకు మొత్తం 16 డిజాస్టర్ బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటి వరకు ఎనిమిది బృందాలను ప్రధాన కార్యాలయంలో సిద్దం చేశారు. ముంపు ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రతి అర కిలోమీటరుకు ఒక ఇన్‌ఛార్జి అధికారిగా డీఎంసీ, మెడికల్ ఆఫీసర్, ఏఎంసీలను నియమించాలని అధికారులు భావిస్తున్నారు.
మహానగరంలో ఓ మోస్తారు వర్షం కురిసినపుడు ఎక్కువగా నీరు నిలుస్తున్న 120 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు.
వీటికి మూడు రకాలుగా చర్యలు చేపట్టనున్నారు. వీటిని ఏ, బీ,సీ క్యాటగిరీలుగా విభజించారు. ఏ క్యాటగిరీ కింద గుర్తించిన పాయింట్ల వద్ద నీటిని తోడేసేందుకు శాశ్వత ప్రాతిపదికన మోటారును ఏర్పాటు చేసి, అసిస్టెంటు ఇంజనీర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించనున్నారు.

గుప్త నిధుల మోసంపై చర్యలు ఏవీ?
ఖైరతాబాద్, జూన్ 24: గుప్తనిధుల పేరుతో ప్రజలను మోసగిస్తున్న వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని స్వామిజీ నాయన కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు భారీగా కొనసాగుతున్నాయని వాపోయారు. భారీ మొత్తంలో నిధులు వస్తాయని ప్రజలను మభ్యపెడుతూ వారి నుంచి లక్షలు కొల్లగొడుతున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన కొందరు తాంత్రిక పూజలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమాయక ప్రజలను మోసగిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.