హైదరాబాద్

సంస్కృతిని కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నమాచార్య ప్రాజెక్ట్ వ్యవస్థాపక సంచాలకుడు కామిశెట్టి శ్రీనివాసులు అన్నారు. ప్రముఖ గాయనీ డా.రామవరపు మాధురీదేవి నిర్వహణలో ‘ భారతీయ శాస్ర్తియ నృత్య సంగీత రీతుల పరిశోధనాత్మక ప్రసంగ’ కార్యక్రమం నవ్య నాటక సమితి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామిశెట్టి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ప్రాశ్చత్య దేశాలలో భారతీయ సంస్కృతిని అదరిస్తుంటే భారతీయులు సంస్కృతిని విస్మరించడం శోచనీయమని అన్నారు. రామవరపు మాధురీదేవి అలపించిన కర్ణాటక సంగీత కచేరి అలరించాయి. ప్రముఖ సంగీత విద్వాంసులు డా.ఎం.చిత్తరంజన్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, మైథిలి కిడాంబి, నాట్య గురువు యేలేశ్వరపు చలపతి శాస్ర్తీ, సంస్థ అధ్యక్ష, కార్యదర్శి వీ.విజయ్ కుమార్, ఆర్‌ఎస్ సుధారాణి పాల్గొన్నారు.
చైతన్యానికి కళా ప్రదర్శన దోహదం
కాచిగూడ, జూన్ 26: సామాజిక చైతన్యానికి కళా ప్రదర్శనలు దోహదపడుతాయని రాష్ట్ర బుర్రకథ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండిరాజుల శంకర్ అన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర బుర్రకథ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుర్రకథ బృందాల ఎంపిక బుధవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ఏభూషి యాదగిరి, ఉసుల రజనికాంత్, ఆచార్యా బాపూజీ, సంస్థ సభ్యులు చౌకే లింగం, ప్రభాకర రావుపాల్గొన్నారు. సమాజంలో ప్రజలకు మంది సందేశాలను లోతుగా తీసుకెళ్లాడానికి బుర్రకథ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు బుర్ర కథ ఎంపికకు వివిధ జిల్లాల నుంచి కళాకారులు పాల్గొన్నారని అన్నారు. ఎంపికలను చేస్తే బుర్రకథ అంతరించి పోవడం కాదు.. అభివృద్ధి చెందుతున్న భావన కలుగుతుందని తెలిపారు. ఉత్తమ కళాకారుల బృందం ఎంపిక చేసి వచ్చే నెలలో వారికి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వివరించారు.