హైదరాబాద్

పుస్తకం ఒక ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 23: పుస్తకం ఉద్యమాన్ని సృష్టిస్తుందని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో పది పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చుక్కారామయ్య పది పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం ఒక ఆయుధం లాటిందని పుస్తకం ద్వారా ఎదైన సాధించవచ్చన్నారు. పాత పుస్తకాలలో ఉన్న విలువలను సంక్షిప్తంగా ప్రచురించి నేటి యువతకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పుస్తకాలు చదవడం వల్ల మేధాశక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకం చదవాలని ఆకాంక్షించారు. నేటి యువతను పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లంనారాయణ మాట్లాడుతూ పుస్తకం ప్రపంచాన్ని తెలియజేస్తుందని తెలిపారు. పుస్తకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని, వాటిని చదవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ కార్యదర్శి కె.చంద్రమోహన్, సాహితీవేత్త తంగిరాల చక్రవర్తి పాల్గొన్నారు.