హైదరాబాద్

రోడ్ల తవ్వకాలకు ముందస్తు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టే అభివృద్ధి పనుల కోసం కావల్సిన రోడ్ల తవ్వకాల విషయంలో ముందస్తుగా ప్రతిపాదనలు స్వీకరించనున్నట్లు సిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. రోడ్డు కట్టింగ్‌లు అవసరమైన వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తుగా ప్రతిపాదనలు పంపితే తాము నవంబర్‌లో అనుమతులు జారీ చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ వెల్లడించారు. శనివారం సీపీడీసీఎల్ ఆఫీసులో సిటీ సమన్వయ సమావేశం జరిగింది.
బల్దియా కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను రోడ్డు కట్టింగ్‌లపై నిషేధం విధించినట్లు తెలిపారు. వివిధ విభాగాలు చేపట్టే అభివృద్ధి పనులకు కావల్సిన రోడ్ల తవ్వకాలకు సంబంధించి ముందుగా ప్రతిపాదనలు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లకు సమర్పిస్తే అనుమతులు జారీ చేసి ముందుస్తుగానే నవంబర్ నుంచి రోడ్ల తవ్వకాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. నగరంలో విపత్తులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా బల్దియా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని మరింత పటిష్టపర్చాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే ప్రతి వర్షాకాలం ఎమర్జెన్సీ బృందాలకు వెచ్చిస్తున్న నిధులతో శాశ్వత ప్రాతిపదికన వాహానాలను కొనుగోలు చేసి, సంబంధిత సిబ్బందితో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకు గాను ప్రతి రెండు వార్డులకు ఒక డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ బృందాలను అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, ఆస్తిపన్ను సేకరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ వంటి విధులకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అన్ని విభాగాల ఎమర్జెన్సీ బృందాలు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
నగరంలో దాదాపు 12వేల మ్యాన్‌హోళ్లను రహదారులకు సమాంతరంగా ఉండేలా నిర్మించే పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరించారు. నగరంలో ఉన్న ప్రధాన రహదారుల్లో అధిక శాతం హైదరాబాద్ రోడ్డు డెలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహణలో ఉన్నాయని, ఈ రహదారులపై లేన్ మార్కింగ్‌లు చేపట్టాలని ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌ను కోరారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 1400 బస్ షెల్టర్లు ఉండగా, వీటిలో 400 బస్ షెల్టర్లను వివిధ కారణాలతో జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు అధికారులు తొలగించారని, తిరిగి ఈ బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. తొలగించిన బస్ షెల్టర్లను తిరిగి ఏర్పాటు చేసే విషయంలో తగిన ప్రతిపాదనలను బల్దియా అదనపు కమిషనర్ అద్వైత్‌కుమార్‌సింగ్, సైబరాబాద్ డీసీపీ విజయకుమార్, ఆర్డీసీ ఈడీ వినోద్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. మలక్‌పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మరో మార్గాన్ని నిర్మించేందుకు ఆరు ఆస్తుల నుంచి స్థల సేకరణకు చర్యలు చేపట్టామని, వీటిలో ఒక ఆస్తిని అందించేందుకు అంగీకారం లభించినట్లు, ఈ విషయంలో మిగిలిన ఆస్తుల స్థలా సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్లానింగ్ విభాగం డైరెక్టర్ కే.శ్రీనివాసరావును కమిషనర్ ఆదేశించారు.
సమావేశంలో సీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జాయింట్ కలెక్టర్లు జి.రవీ, హరీశ్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి హాజరయ్యారు.