హైదరాబాద్

మరోసారి తాకీదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శిథిలావస్థకు చేరిన పాతకాల భవనాలపై బల్దియా స్పష్టమైన చర్యలు తీసుకోలేకపోతోంది. ఫలితంగా కొద్దిరోజుల క్రితం సికిందరాబాద్‌లో మరో పాతకాలం ఇల్లు కూలి 13 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమై పాతకాలపు భవనాల యజమానులకు మరోసారి తాకీదులు చేయాలని నిర్ణయించారు.
ఈ భవనాలను కూల్చివేయనున్నట్లు సూచిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలని, లేనిపక్షంలో యజమానులే ఆ భవనాలు కూలకుండా ఉండేందుకు వీలుగా పటిష్టపరిచే చర్యలు, మరమ్మతులు చేపట్టాలని సూచించాలని కమిషనర్ దాన కిషోర్ సోమవారం ఆదేశించారు. పాతకాలం ఇళ్లు కూలి బాలుడు మృతి చెందిన ఘటనపై ఆయన ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికిందరాబాద్‌లో శిథిలావస్థకు చేరిన మరో ఇల్లు కూలి బాలుడు మృతి చెందిన ఘటన విచారకమని పేర్కొన్నారు. ఇలాంటి భవనాలు ఇంకా నగరంలో 457 వరకు ఉన్నాయని, వీటిని సీజ్ చేయటమో కూల్చి వేయటమో చేపట్టాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

ప్రతి బస్టాపులో డస్ట్‌బిన్

హైదరాబాద్, జూలై 22: మహానగరంలో నూటికి నూరు శాతం పరిశుభ్రత, స్వచ్ఛతను సాధించేందుకు జీహెచ్‌ఎంసీ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తోంది. ఇప్పటికే నగరంలో పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేందుకు కమిషనర్ దాన కిషోర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టగా, మహానగరంలో రోడ్డుకిరువైపులా ఉన్న వీధి వ్యాపారులు తప్పకుండా డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా ప్రతి బస్టాపులో ఖచ్చితంగా డస్ట్‌బిన్ ఉండాల్సిందేని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో అన్ని బస్టాపుల్లో ఈ డస్ట్‌బిన్లు అందుబాటులోకి రావాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. దీంతోపాటు ఇప్పటికే ఆదేశించిన వీధి వ్యాపారులు కూడా ఆగస్టు నెలాఖరుకల్లా తప్పకుండా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదనపు వాహనాలను పూర్తి స్థాయిలో వినియోగించటం ద్వారా చెత్త సేకరణ విషయంలో స్పష్టమైన మార్పు కన్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.