హైదరాబాద్

ఎండలో బస్సు కోసం ఎంత నిరీక్షణో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 24: మహానగరాన్ని గ్లోబల్ సీటిగా వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చుదిద్దుతామన్న ప్రకటనలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టు తయారైంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతీ రోజు లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్ధులు, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, వయో వృద్దులను తమ గమ్యస్థానాలకు చేరుస్తామని చెబుతున్న ఆర్టిసీ సంస్థ క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు. ఒక వైపు 15 ఏళ్ల తరువాత నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత్తలు నమోదవుతున్నా బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు.. బస్‌స్టాప్ కూడా కరువయింది. నగరంలో ప్రతి రోజు దాదాపు 9000 బస్సులు వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఆధునిక రవాణ వ్యవస్థ మెట్రోరైల్ అందుబాటులోకి తెస్తున్నామంటూ పనులు జోరుగా సాగుతున్నాయని ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలు చేస్తుందే తప్ప మెట్రోపనుల కారణంగా మూడు కారిడార్‌లలో నిర్మిస్తున్న రూట్‌లలో కనుమరుగైన బస్‌షెల్టర్లను పునఃరుద్దరించడంపై పాలకులు, యాజమాన్యం శ్రద్ధ వహించడం లేదు.
నగరంలో అతిపెద్ద ఆర్టీసి బస్‌స్ట్ఫాగా పేరుగాంచిన కోటి, లక్డీకపూల్, సచివాలయం, పంజాగుట్ట, బేగంపేట్, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘట్, నల్లగొండ క్రాస్‌రోడ్, మలక్‌పేట్, నాగోల్, ఉప్పల్, హబ్సీగూడ ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డు ఉన్న అమీర్‌పేట్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు కనుమరుగైయ్యాయి.
రేపోమాపో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతున్న కారిడార్ -3 శిల్పారామం - నాగోల్‌లో కూడా రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లోని బస్‌స్టాప్‌లను నేటికి పునఃరుద్ధరించడం లేదు.
గతంలో రద్దీగా ఉండే లక్డీకపూల్, సచివాలయం, పంజాగుట్ట, కోటి ఉమెన్స్‌కాలేజ్, సికింద్రాబాద్ వంటి బస్‌షెల్టర్లలో ప్రయాణికులు నిలబడేందుకు కాస్త అనువైన షెల్టర్, రాకపోకలు సాగించే జనానికి ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారు కానీ ప్రస్తుతం నగరంలో మెట్రోరైలు పనులు జోరుగా సాగుతున్నందున బస్‌షెల్టర్లు కనుమరుగైపోవడమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు నీటిని పంపిణీ చేసేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎండాకాలం వేసవి తాపం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు తాత్కాలికంగానైనా బస్‌స్టాప్‌లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.