హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం అని పలువురు వక్తలు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త ప్రాచార్య రఘునాథ శర్మకు ఆచార్య ‘జీవీ ఎస్ సాహితీ’ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం ధృవం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని శలాక రఘునాథ శర్మకు పురస్కారం ప్రదానం చేశారు. ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం తెలుగుదనం నిండిన గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉండే మహనీయ మూర్తి అని కీర్తించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యలుగా, విభాగాధిపతిగా, ఉపకులపతిగా ప్రసిద్ధి చెందారని వివరించారు. సంగీత, సాహిత్య, నాటక, నృత్య రంగాల్లో రాణించారని పేర్కొన్నారు. ప్రాచీన సాహిత్య పరిరక్షణ కోసం ప్రవచనాలని చేస్తూ భారత సేవ చేస్తున్న సారస్వత మూర్తి ప్రాచార్య శలాక రఘునాథ శర్మ అని కొనియాడారు. అనేక గ్రంథాలను రచించి భావితరలకు అందించారని తెలిపారు. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి రాయసం వెంకట రామయ్య, విమర్శకురాలు ఆచార్య కాత్యాయనీ విద్మహే, వంశీ సంస్ధల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, డాక్టర్ ఎస్‌కేఎం శాస్ర్తీ, డా.గంగిశెట్టి లక్ష్మీనారాయణ, సంస్థ అధ్యక్షురాలు సౌమ్య వారణాసి పాల్గొన్నారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అన్నదానం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 10: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కొలువుదీరిన ఏకదంతుని చెంతన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహఙంచారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్ రెడ్డి, రాజవౌళి చారి.. గౌరీతనయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పాలక మండలి సభ్యులు వేణుగోపాల్ నాయుడు, హరి ప్రసాద్, గోపాల్‌రెడ్డి, యశోద తదితరులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించిన సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.