హైదరాబాద్

ప్రాచీన కళా రూపాలను కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : తెలంగాణ పాచ్రీన రూపాలను కాపాడుకోవాలని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. తెలంగాణ బుర్రకథ పితామహుడు సుద్ధాల మనుమంత జ్ఞాపకార్ధం ‘బుర్రకథ సాప్తహం’ గానసభ ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతరించిపొతున్న కళలను గానసభ వెలుగులోకి తీసుకురావాడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ బుర్రకథ కళాకారుడు బండి రాజుల శంకర్‌చే ‘సీతాపరిత్యాగము’ బుర్రకథ ఆకట్టుకుంది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ, ప్రముఖ వైద్యుడు డా.విష్ణురావు, రచయిత పూసర్ల రజనీ గంగాధర్ పాల్గొన్నారు.
‘వంశీ రామరాజు - తెనే్నటి సుధ’కు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, సెప్టెంబర్ 13: వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ‘డా.వంశీ రామరాజు - డా.తెనే్నటి సుధాదేవి’ దంపతులకు ఆత్మీయ సత్కర కార్యక్రమం అభినందన సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆచార్య ఎన్. గోపీ పాల్గొని వంశీ దంపతులకు ఆత్మీయ సత్కరంతో పాటు ఎక్సలెన్సీ అవార్డును ప్రదానం చేశారు. వంశీ రామరాజు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేరు ప్రఖ్యాతి సంపాధించారని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, ప్రముఖ రచయిత్రి డా.కేవీ కృష్ణవేణి పాల్గొన్నారు.
‘సహకార ప్రపంచం’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, సెప్టెంబర్ 13: ముద్ర అగ్రికల్చర్, స్కీల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో అపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘పొదుపు ఉద్యమం - పాలకుల నైతిక బాధ్యత’ అనే అంశంపై చర్చా వేదిక శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ.చంద్రకుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు ఆళ్ల రాంబాబు పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో అర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని, పాలకులు, ప్రజల సమస్వయంతో వ్యవహారిస్తే అర్థిక సంక్షోభాన్ని సులభంగా ఎదుర్కోవచ్చని వివరించారు. తిప్పినేని రామదాసప్ప నాయుడు రచించిన ‘తదవ దతవ ‘సహకార ప్రపంచం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.