హైదరాబాద్

ఆంధ్రాశ్రమం ఆధ్వర్యంలో హిందీ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వారణాసి ఆంధ్రాశ్రమానికి చెందిన వేమూరి శ్రీరామచంద్రమూర్తి కుసుమాంబ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం వారణాసిలో బెంగాలీ టోలా ఇంటర్ కాలేజీలో హిందీ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 40 మంది పేద పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వీవీ సుందరశాస్ర్తీ, వీవీ సీతారామ అందచేశారు. ఈ కార్యక్రమంలో నీరజ్ మిశ్రా, శ్రీమతి శారదా సింగ్, కాలేజీ ప్రధానాచార్యులు జయప్రకాశ్ పాండే, కిషోర్ కుమార్, సందీప్ కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
మున్నూరు కాపులకు ప్రాధాన్యతపై హర్షం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించడం హర్షనీయమని మున్నూర్ కాపు సంఘం పేర్కొంది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మహిళా అధ్యక్షరాలు అల్లాడి గీతా రాణి మాట్లాడారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో గంగుల కమలాకర్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో పాటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు చీఫ్ విప్‌గా అవకాశం కల్పించడాన్ని యావత్ మున్నూరు కాపు సామాజిక వర్గం హర్షిస్తుందని చెప్పారు. సమావేశంలో నాయకులు హరిశంకర్, శ్రీకాంత్, రాజారామ్, రజిత, మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు.