హైదరాబాద్

ఇక ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో అర్చకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: క్షణం తీరకలేని నగర జీవితంలో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లో వెతికేయడం సర్వసాధారణం అయింది. ఇదే తరహాలో అర్చకులను ఆన్‌లైన్‌లో వెతికేందుకు ఓ వైబ్‌సైట్‌ను రూపొందించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆన్‌లైన్‌లో అర్చకుల వివరాలను అందించేందుకు రూపొందించిన వైబ్‌సైట్ గెట్ పురోహిత్ డాట్ కామ్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని పనులు చకచకా అయిపోతున్నాయని, చివరకు పురోహితులను వెతుక్కునేందుకు ఓ వైబ్‌సైట్ అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశ్వమంతా సుఖసంతోషాలతో జీవించాలని దీవించే పురోహితుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గుళ్లకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా పురోహితులకు ఆదరణ లభించక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇళ్లలో జరిగే చిన్నపాటి పూజా కార్యక్రమానికి పురోహితుని అవసరం ఎంతో ఉంటుందని, అవసరానికి పురోహితున్ని వెతుక్కోవడం భారంగా మారిన ప్రస్తుత తరుణంలో ఈ వైబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కేవలం పురోహితులు వివరాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల వివరాలు, దేవతామూర్తుల ఆరాధనలు, ఆచార - సంప్రదాయాలు, ఉపనిషత్తులను ఇందులో పొందుపరిచినట్టు వైబ్‌సైట్ రూపకర్త నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ అర్చక, పురోహిత సంఘం అధ్యక్షుడు శ్రీనివాస చారి, ప్రీతినిగమ్, శంకర్, కృష్ణ పాల్గొన్నారు.