హైదరాబాద్

విజయవంతంగా భక్తి భజన సంకీర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భక్తి భజన సంకీరతన ప్రచార పరిషత్ నిర్వహిస్తున్న భజన పోటీలు గురువారం రవీంద్రభారతి సమావేశమందిరంలో విజయవంతంగా జరిగాయి. పోటీలో పాల్గొన్న ఒక బృందం సినీ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో సినీగీతాలు, వాటి అనుకరణ పాటలు వద్దని మృదువుగా ఖండిస్తూ మరోగీతాన్ని ఆలపించాలని కార్యదర్శి జె.శివప్రసాద్ సూచించడంతో ఖచ్చితమైన నియమాలు పాటిస్తున్నారని ప్రేక్షకులు, ఇతర కళాకారులు హర్షించారు. ఈ పోటీలలో జంట నగరాలతోపాటు మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా కళాకారులు పాల్గొన్నారు. వీరిలో అయ్యప్ప భజనమండలి (పార్శిగుట్ట), వేంకటేశ్వర భజనమండలి (వికారాబాద్), హనుమాన్ భజనమండలి (మెదక్), మారుతీ భజన మండలి (మహబూబ్‌నగర్) తదితర 20 సమాజాలు పాల్గొన్నాయని కార్యక్రమ కో ఆర్డినేటర్ డా.ఎస్.విజయభాస్కర్ చెప్పారు. కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షురాలు జె.సుధారాణి నిర్వహించారు.