హైదరాబాద్

1 నుంచి ఉచిత అష్టాంగ విన్యాస యోగ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే యోగాను అందరికీ అందించాలనే లక్ష్యంతో మే1 నుంచి నగరంలో ఉచిత అష్టాంగ విన్యాస యోగ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు డాక్టర్ ఎఎల్‌వి కుమార్ తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందిందని అన్నారు. మనదేశస్థులు వ్యాధులను నయం చేసుకునేందుకు మాత్రమే యోగాను చేస్తుంటే అభివృద్ధి చెందిన దేశాల్లో నివసించే వారు ఫిట్‌నెస్ కోసం చేస్తున్నారని చెప్పారు. యోగా మనకు పూర్వికులు అందించిన గొప్ప వరమని సహజ సిద్ధమైన ఆహార నియమాలు పాటిస్తూ, నిత్యం యోగా, ధ్యానం చేస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. నాగరిక జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వారికి యోగావల్ల ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ఉచిత యోగా శిబిరాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
మే 1 నుంచి 7 తేదీ వరకు కూకట్‌పల్లిలోని రమ్య గ్రౌండ్‌లో ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు కొనసాగుతుందని వివరించారు. ఇలా నగరవ్యాప్తంగా యోగ అవగాహన, శిక్షణ తరగతులను కొనసాగించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. పూర్తివివరాల కోసం 9246464745, 939713349 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.