హైదరాబాద్

కైతి లంబాడాలను ఎస్టీల్లో కలపొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: షెడ్యూల్ తెగల జాబితాలో వాల్మీకి బోయలు, కైతి లంబాడాలను కలప వద్దని గిరిజన రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) షెడ్యూల్ తెగల విచారణ కమిషన్ చైర్మన్ చల్లప్పకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్నంగా జెఎసి తరఫున కమిషన్ చైర్మన్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేసినట్లు కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.శోభన్ నాయక్ తెలిపారు. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణపై సమావేశం జరిగింది. ఎస్టీల జాబితాలో ఇతర కులాలను కలపాలన్నా, తొలగించాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని శోభన్ నాయక్ అన్నారు. ఈ రెండు కులాలను ఎస్టీల జాబితాలో కలపడం గిరిజన తెగ మనుగడకే ప్రమాదమని తెలిపా