హైదరాబాద్

బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటుపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: చెంగిచర్ల గ్రామపంచాయతీని బోడుప్పల్ గ్రామ పంచాయతీలో విలీనం చేసి, అనంతరం బోడుప్పల్ మున్సిపాలిటీగా నోటిఫై చేయాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్ గ్రామ పంచాయతీ ఎంపిటిసి సభ్యులు డి.వీరాచారి, జె.పద్మలు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు బుధవారం విచారణ నిర్వహించింది. పిటీషనర్ల తరఫు న్యాయవాది ఎస్.సత్యం రెడ్డి వాదిస్తూ బోడుప్పల్‌కు ఎన్నికైన పంచాయతీ కార్యవర్గం లేనందున ప్రభుత్వం ముందుగా ఎలాంటి నోటీస్ జారీ చేయకుండా డి-నోటిఫై చేయడం చట్టబద్దత కాదని అన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రెండు జివోలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర స్టే మంజూరు చేసింది. ఈకేసును వేసవి సెలవుల అనంతరం చేపట్టేందుకు వీలుగా వాయిదా వేసింది.